AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దసరాకు ఇంటికెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లు.. బుకింగ్స్ స్టార్ట్..

దసరా, దీపావళికి ఇంటికెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే పలు రైళ్లను తీసుకురాగా.. తాజాగా మరికొన్ని స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. వీటికి సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్లను మొదలుపెట్టింది. దీంతో ఇప్పటినుంచే బుకింగ్ చేసుకోవచ్చు.

దసరాకు ఇంటికెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లు.. బుకింగ్స్ స్టార్ట్..
Special Trains
Venkatrao Lella
|

Updated on: Sep 30, 2026 | 9:35 PM

Share

దసరా, దీపావళి పండుగలు మరికొద్ది రోజుల్లో రానున్న క్రమంలో రైల్వేశాఖ అప్రమత్తమైంది. పండుగల సమయాల్లో ప్రయాణికులు రద్దీ భారీగా పెరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పండుగల సమయాల్లో వివిధ కారణాలతో నగరాలు, పట్టణాల్లో నివసించేవారు తమ సొంతూళ్లకు వెళతారు. ఇందుకోసం ముందుగానే రైళ్లల్లో టికెట్లను బుక్ చేసుకుంటారు. రైళ్లల్లో ఫుల్ రద్దీ ఉంటుంది. దీంతో రైల్వేశాఖ స్పెషల్ రైళ్లను పండుగల సమయాల్లో పెద్ద సంఖ్యలో నడుపుతూ ఉంటుంది. దసరా, దీపావళి పండుగల కోసం ఇప్పటికే 100కిపైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించగా.. తాజాగా మరికొన్ని రైళ్లను వెల్లడించింది.

చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్, చర్లపల్లి- సాసారామ్ మార్గాల్లో స్పెషల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వేశాఖ ప్రకటించింది. చర్లపల్లి – హజ్రత్ నిజాముద్దీన్ ట్రైన్(07021) ప్రతీ సోమవారం అందుబాటులో ఉంటుంది. ఇది అక్టోబర్ 19 నుంచి నవంబర్ 30 వరకు సర్వీసులు అందించనుంది. హజ్రత్ నిజాముద్దీన్ – చర్లపల్లి(07022) రైలు ప్రతీ బుధవారం తిరగనుండగా..ఇది అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 2 వరకు సర్వీసులు అందించనుంది. చర్లపల్లి – హజ్రత్ నిజాముద్దీన్( 07023) రైలు అక్టో్బర్ 20 నుంచి నవంబర్ 24 వరకు ప్రతీ మంగళవారం, హజ్రత్ నిజాముద్దీన్ – చర్లపల్లి(07024) అక్టోబర్ 22 నుంచి నవంబర్ 26 వరకు ప్రతీ గురువారం అందుబాటులో ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది. దసరా, దీపావళికి రద్దీని అంచనా వేసి ఈ మార్గంలో ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేసింది.

ఈ రైళ్లు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌‌నగర్, బల్హార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, గ్వాలియర్, ధౌల్‌పూర్, ఆగ్రా కాంట్, మధుర, కోసి కలాన్ రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. వీటిల్లో ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్‌తో పాటు స్లీపర్ క్లాస్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

చర్లపల్లి-సాసారామ్(07041) ప్రత్యేక రైలు అక్టోబర్ 8 నుంచి నవంబర్ 26 వరకు ప్రతీ గురువారం, సాసారామ్- చర్లపల్లి(07042) అక్టోబర్ 9 నుంచి నవంబర్ 27 వరకు ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైల్లు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, నాగ్‌పూర్ వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి. వీటిల్లో ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లల్లో ఇప్పటికే రిజర్వేషన్లను రైల్వేశాఖ మొదలుపెట్టింది. దీంతో ఇప్పటినుంచే బుక్ చేసుకోవచ్చని రైల్వేశాఖ ప్రకటించింది. పండుగల సమయాల్లో ఈ రైళ్లను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని రైల్వేశాఖ సూచించింది. త్వరలో మరికొన్ని ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ప్రవేశపెట్టనుంది.

Follow Us