బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ కావాలా..? ‘Vivo T5e’ ధర తెలిస్తే నిజంగానే కొనేస్తారు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో భారత మార్కెట్లో తన టీ-సిరీస్‌లో సరికొత్త బడ్జెట్ ఫోన్ 'Vivo T5e'ను అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, ఏఐ ఆధారిత ఫీచర్లు, బలమైన నిర్మాణంతో యూజర్లను ఆకట్టుకునేలా రూపుదిద్దుకున్న ఈ నయా డివైజ్ గురించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం!

రూ. 13,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ‘Vivo T5e’ స్మార్ట్‌ఫోన్‌లో 5,500mAh భారీ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అమర్చారు. మిలిటరీ-గ్రేడ్ మన్నిక, అధునాతన ఏఐ టూల్స్‌తో కూడిన ఈ వివో T5e మోడల్ పూర్తి వివరాలను తెలుసుకుందాం!
లభ్యత వివరాలు
వివో (Vivo) భారత మార్కెట్లో టీ-సిరీస్‌లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘Vivo T5e’ను అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, ఏఐ ఆధారిత ఫీచర్లు, బలమైన నిర్మాణంతో యూజర్లను ఆకట్టుకునేలా ఈ ఫోన్‌ను కంపెనీ రూపొందించింది. కొత్త Vivo T5e 4GB RAM మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 13,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం వివో అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ షాడో గ్రే (Shadow Grey), ఏరో బ్లూ (Aero Blue) అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ప్రాసెసర్ పనితీరు
Vivo T5eలో 6.74 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్సీడీ (HD+ LCD) డిస్‌ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్ మరియు మెరుగైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్‌కు యునిసోక్ T7225 (UNISOC T7225) ఆక్టా-కోర్ ప్రాసెసర్ శక్తినిస్తుంది. ఇందులో 4GB RAMతో పాటు 4GB ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సపోర్ట్ ఉండటంతో మొత్తం 8GB వరకు ర్యామ్ అనుభవాన్ని పొందవచ్చు. ఫోటోగ్రఫీ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేశారు. బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ రోజువారీ అవసరాలకు ఇది సరిపోతుంది.
ఏఐ ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత ఆరిజిన్ఓఎస్ 6 (OriginOS 6)పై పనిచేస్తుంది. ఇందులోని ముఖ్యమైన ఏఐ ఫీచర్లలో టెక్స్ట్ రూపొందించే ‘AI Creation’, ఫోటోలలోని బ్యాక్‌గ్రౌండ్‌ను తొలగించే ‘AI Cutout’, డాక్యుమెంట్‌లను నిర్వహించే ‘Vivo DocMaster’ వంటి స్మార్ట్ టూల్స్ విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇందులో 5,500mAh భారీ బ్యాటరీని అందించగా, ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. బ్యాటరీ హెల్త్ ప్రొటెక్షన్ టెక్నాలజీతో ఇది నాలుగు సంవత్సరాల వరకు స్థిరమైన పనితీరును అందిస్తుంది. అదనంగా IP64 డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్, మిలిటరీ-గ్రేడ్ మన్నిక, వెట్-హ్యాండ్ టచ్ సపోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
