కాఫీ, టీలు పక్కన పెట్టండి.. ఓ నెల రోజుల పాటు ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ ట్రై చేయండి.. అందం, ఆరోగ్యం డబుల్!
మన ప్రాచీన ఆయుర్వేదంలో బెల్లానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చెరకు రసం నుంచి సహజసిద్ధంగా తయారయ్యే బెల్లం కేవలం రుచికే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నిలయం. రోజువారీ జీవితంలో టీ, కాఫీలకు బదులుగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో బెల్లం పొడి కలుపుకుని తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అవన్నీ తెలియాలంటే పూర్తి డిటెల్స్‌లోకి వెళ్లా్ల్సిందే...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో బెల్లం కలుపుకుని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బెల్లంలో ఐరన్, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియంతో పాటు విటమిన్ బి1, బి6, సీ సమృద్ధిగా ఉంటాయి. పరగడుపున బెల్లం నీరు తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు ఉత్తేజితమవుతాయి. ఇది పేగుల కదలికలను క్రమబద్ధీకరించి మలబద్ధకం, గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. కిడ్నీ సమస్యలను నయం చేస్తుంది.
రక్తహీనతకు చెక్:
బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా రక్తహీనత తో బాధపడే మహిళలు రోజూ పరగడుపున ఈ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
సహజ డీటాక్స్ పానీయం:
బెల్లం నీరు ఒక మంచి డీటాక్స్ డ్రింక్‌లా పనిచేస్తుంది. ఇది శరీరంలోని హానికర విషపదార్థాలను బయటకు పంపి కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. అంతేకాకుండా మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు కూడా నయం అవుతుంది. చర్మానికి సహజ మెరుపు అందుతుంది.
రోగనిరోధక శక్తి, తక్షణ శక్తి:
ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అలాగే ఇందులోని సహజ చక్కెర శరీరానికి తక్షణ శక్తిని అందించి నీరసం, అలసటను దూరం చేస్తుంది.
బరువు నియంత్రణ, కీళ్ల నొప్పుల ఉపశమనం:
ఈ నీటిని తాగడం వల్ల జీవక్రియ వేగవంతమై శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరుగుతుంది. అంతేకాకుండా ఇందులోని కాల్షియం, ఫాస్పరస్ ఎముకలను బలపరిచి కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ఎలా తయారు చేయాలి?:
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా సహజమైన బెల్లం పొడిని కలిపి బాగా తిప్పాలి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీనిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




