Covid-19 Cases in India: గడచిన 24 గంటల్లో 743 కరోనా కేసులు.. ఏడుగురు మృతి!

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం నుంచి శనివారం నాటికి 24 గంటల్లో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 743 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం దేశంలో క్రియాశీలక కేసుల సంఖ్య 3,997కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధికారిక సమాచారం ప్రకారం.. కేవలం ఒక్క రోజులోనే ఏడు  కోవిడ్‌ మరణాలు చోటు..

Covid-19 Cases in India: గడచిన 24 గంటల్లో 743 కరోనా కేసులు.. ఏడుగురు మృతి!
Jn 1 Variant
Follow us

|

Updated on: Dec 31, 2023 | 7:02 AM

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 30: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం నుంచి శనివారం నాటికి 24 గంటల్లో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 743 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం దేశంలో క్రియాశీలక కేసుల సంఖ్య 3,997కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధికారిక సమాచారం ప్రకారం.. కేవలం ఒక్క రోజులోనే ఏడు  కోవిడ్‌ మరణాలు చోటు చేసుకున్నాయి. కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, ఛత్తీస్‌గఢ్, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీనితో 2020 జనవరిలో కోవిడ్‌ వ్యాప్తి చెందినప్పటి నుండి దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 4,50,12,484కి చేరుకుంది. అలాగే తాజా COVID-19 మరణాలతో కలిపి నాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 5,33,358కి పెరిగినట్లైంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధికారిక నివేదిక ప్రకారం.. డిసెంబర్ 28 నుంచి 29 వరకు 41,797 కోవిడ్-19 సబ్‌వేరియంట్ JN.1 పరీక్షలు జరిగాయి. 24 గంటల్లో కొత్త వేరియంట్ కేసులు మొత్తం 145 నమోదయ్యాయి. ఈ నమూనాలను నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 మధ్య సేకరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా JN.1 సబ్-వేరియంట్ అనేది BA.2.86 అనే పేరుగల ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ అనే విషయం తెలిసిందే. JN.1 వేరియంట్ మొదటి కేసు కేరళలో వెలుగు చూసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. జేఎన్‌.1ని దాని మాతృ వంశం BA.2.86కు విభిన్నంగా ఉన్నట్లు తెలిపింది. అయితే JN.1 వల్ల ప్రమాదం తీవ్రత తక్కువగానే ఉందని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. కొత్త వేరియంట్‌ వల్ల ఇప్పటి వరకూ మరణాలు సంభవించకపోవడం విశేషం.

జేఎన్‌.1 వేరియంట్ కోవిడ్‌ కేసుల్లో 50శాతం అమెరికాలోనే..CDC

JN.1 వేరియంట్ అమెరికాలో ప్రమాద గటికలు మోగిస్తోంది. అక్కడ వేగవంతంగా వ్యాప్తి చెందుతున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది. కోవిడ్‌ కొత్త వేరియంట్ ప్రస్తుతం దాదాపు 41 దేశాలలో ఉంది. ఇది మొదట ఆగస్టులో లక్సెంబర్గ్‌లో బయటపడింది. గత 2 వారాల్లో JN.1 వైరస్‌ వ్యాప్తి15-29 శాతం నుంచి 39-50 శాతానికి పెరిగిందని CDC పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.