TSPSC Group 2 Postponed: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 పరీక్ష మూడోసారి వాయిదా.. త్వరలో కొత్త తేదీలు ప్రకటన
తెలంగాణ ‘గ్రూప్-2’ రాతపరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. వచ్చే నెల 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బుధవారం (డిసెంబర్ 27) టీఎస్పీయస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త తేదీలను తరువాత వెల్లడిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే రెండు సార్లు..
హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ ‘గ్రూప్-2’ రాతపరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. వచ్చే నెల 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బుధవారం (డిసెంబర్ 27) టీఎస్పీయస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త తేదీలను తరువాత వెల్లడిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదాపడటంతో అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది.
కొత్త సర్కార్ ఏర్పడిన తర్వాత టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌తోపాటు మరో ముగ్గురు బోర్డు సభ్యుల రాజీనామా నేపథ్యంలో పరీక్ష నిర్వహణపై అయోమయం నెలకొన్నది. కొత్త సభ్యులను ఏర్పాట్లు చేస్తే తప్ప గ్రూప్ 2 నిర్వహించడం సాధ్యంకాదు. ప్రస్తుతం రాజీనామా చేసిన వారి లేఖలు గవర్నర్ వద్ద ఉన్నాయి. గవర్నర్ వాటిని ఆమోదిస్తున్నట్లు ఇంతవరకూ ప్రకటన వెలువడకపోవడంతో చేసేదిలేక మరోమారు గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గత ఏడాది గ్రూప్-2లో ఉద్యోగ ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది.
కానీ నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు దాన్ని నవంబరు 2, 3 తేదీలకు మార్చారు. నవంబరు 1 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ వాయిదా వేసింది. 2024 జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని రీషెడ్యూల్ చేసింది. దీంతో అభ్యర్ధులు ప్రిపరేషన్‌పై దృష్టిసారించారు. తాజాగా మూడోసారి వాయిదా పడటంతో అభ్యర్ధు్ల్లో నిరాశ నెలకొంది. బుధవారం టీఎస్‌పీఎస్సీపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.