Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Criminal Justice Acts: కొత్త క్రిమినల్‌ బిల్లులకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం.. అమలులోకి ఆ మూడు కొత్త చట్టాలు

గత వారం పార్లమెంట్ ఆమోదించిన మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం (డిసెంబర్‌ 25) ఆమోదం తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఈ మూడు చట్టాలను తీసుకొచ్చింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలకు సంబంధించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బ్రిటీష్‌ కాలంనాటి..

New Criminal Justice Acts: కొత్త క్రిమినల్‌ బిల్లులకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం.. అమలులోకి ఆ మూడు కొత్త చట్టాలు
President Droupadi Murmu
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 26, 2023 | 10:48 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: గత వారం పార్లమెంట్ ఆమోదించిన మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం (డిసెంబర్‌ 25) ఆమోదం తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఈ మూడు చట్టాలను తీసుకొచ్చింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలకు సంబంధించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బ్రిటీష్‌ కాలంనాటి భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో వీటిని తీసుకొచ్చింది. ఈ మూడు కొత్త బిల్లులకు ఆగస్ట్‌లో జరిగిన శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఉభయసభలు ఆమోదం తెలిపాయి. శిక్ష విధించడం కన్నా న్యాయం చేయడమే లక్ష్యంగా వీటిని తీసుకొచ్చినట్లు పార్లమెంట్‌ చర్చ సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. దీంతో తాజాగా ఈ బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం కేంద్రం పంపించింది. ఈ మూడు బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలుపుతూ గెటిట్‌ విడుదల చేయడంతో ఈ బిల్లులు చట్టరూపం దాల్చాయి.

ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌‌లలో కొన్ని సవరణలతో పాటు, మరికొన్ని కొత్త అంశాలను చేర్చారు. వీటిల్లో వివిధ నేరాలు, వాటి శిక్షలను పేర్కొన్నారు. దేశంలోని నేర న్యాయ వ్యవస్థను సమూలంగా మార్చుతూ ఈ మూడు చట్టాలను రూపొందించారు. ఆ మూడు చట్టాల పేర్లను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాలను తీసుకువచ్చింది. ఇకపై ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సీఆర్‌పీసీ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఎవిడెన్స్ యాక్ట్‌ స్థానంలో భారతీయ సాక్ష్య అధీనం పేర్లతో పిలవనున్నారు. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ పేర్లు ఇక నుంచి కనిపించవు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాల్లో ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనాన్ని ఇచ్చాయి. దేశద్రోహం నేరాన్ని రద్దు చేశాయి. ఈ చట్టాల ప్రకారం.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం లేదా వ్రాసిన, లేదా సంకేతాల ద్వారా, లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా లేదా ఆర్థిక మార్గాలను ఉపయోగించడం ద్వారా లేదా వేర్పాటు లేదా సాయుధ తిరుగుబాటును ఉత్తేజపరిచినా.. ప్రేరేపించడానికి ప్రయత్నించినా.. భారత సార్వభౌమత్వం లేదా ఐక్యత, సమగ్రతలకు హాని కలిగించడం వంటి ఏదైనా చర్యకు పాల్పడితే యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. అలాగే జరిమానా కూడా విధించడం జరుగుతుంది. కొత్త చట్టాల ప్రకారం, ‘రాజ్‌ద్రోహ్‌’ పదానికి బదులుగా’దేశ్‌ద్రోహ్‌’ అనే కొత్త పదం చేర్చడం జరిగింది. తద్వారా బ్రిటీష్ కాలం నాటి పదజాలం ప్రస్తావన లేకుండా పోయింది. అలాగే తొలిసారిగా భారతీయ న్యాయ సంహితలో ఉగ్రవాదం అనే పదాన్ని చేర్చారు. ఇది ఐపీసీలో లేదు. అలాగే జరిమానాలు విధించే మేజిస్ట్రేట్ అధికారాన్ని పెంపొందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.