AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: దారుణం.. తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని మరదలిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన అన్న

మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో శనివారం పట్టపగలు దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహించిన అన్న దారుణానికి పాల్పడ్డాడు. తమ్ముడు భార్యను ఆమె ఇద్దరి బిడ్డలు చూస్తుండగా సజీవదహనం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా ధోధర్‌ గ్రామానికి చెందిన ప్రకాశ్‌ అనే వ్యక్తి వ్యక్తిగత కారణాలతో ఆర్నెల్ల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు..

Crime News: దారుణం.. తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని మరదలిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన అన్న
Woman Burnt Alive By Brother In Law
Srilakshmi C
|

Updated on: Dec 25, 2023 | 7:31 AM

Share

రత్లాం, డిసెంబర్‌ 25: మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో శనివారం పట్టపగలు దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహించిన అన్న దారుణానికి పాల్పడ్డాడు. తమ్ముడు భార్యను ఆమె ఇద్దరి బిడ్డలు చూస్తుండగా సజీవదహనం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా ధోధర్‌ గ్రామానికి చెందిన ప్రకాశ్‌ అనే వ్యక్తి వ్యక్తిగత కారణాలతో ఆర్నెల్ల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతడి భార్య నిర్మల (33) తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్తింటి వద్దే నివసిస్తోంది. తమ్ముడి బలవన్మరణానికి నిర్మలే కారణమంటూ ప్రకాశ్‌ అన్న సురేశ్‌ (40) ఆమెను వేధించసాగాడు. ఈ క్రమంలో శనివారం సురేశ్‌ రాడ్డుతో మరదలిపై దాడికి దిగాడు. అనంతరం నిర్మలపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. కన్నబిడ్డల కళ్లెదుటే నిర్మల మృతి చెందింది.

అనంతరం మృతురాలు నిర్మల సోదరులకు ఫోన్‌ చేసి తానే మరదలికి నిప్పంటించానని సురేశ్‌ చెప్పాడు. ఈ మేరకు నిందితుడు తమకు ఫోను చేసి చెప్పినట్లు నిర్మల సోదరుడు మీడియాకు తెలిపాడు. భర్త చావుకు తన సోదరే కారణమని, ఆమెను చంపేస్తానని సురేశ్‌ గతంలోనూ పలుమార్లు బెదిరించినట్లు ఆరోపించాడు. ఆమెను పుట్టింటికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇంతలో ఈ ఘోరం జరిగినట్లు మీడియా ఎదుట కన్నీటి పర్యాంతమయ్యాడు.

ఈ ఘటనపై నిర్మల సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, జైలుకు తరలించారు. విచారణలో సురేష్ తన నేరాన్ని అంగీకరించాడని, హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రాహుల్ కుమార్ లోధా తెలిపారు. నిర్మల హత్య వెనుక గల అసలు కారణాలు, ప్రకాష్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ సంఘటన గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితుడిని కఠిన శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.