IIT Kanpur: పాఠాలు చెబుతూ గుండెపోటుతో ఐఐటీ ప్రొఫెసర్ హఠన్మరణం.. ఆరోగ్యం గురించి మాట్లాడుతూ అస్వస్థత
ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ పాఠాలు చెబుతూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్‌లో విషాదం నెలకొంది. స్టూడెంట్ అఫైర్స్ డీన్, మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ (55) శుక్రవారం (డిసెంబర్ 22) సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇన్‌స్టిట్యూట్ ఆడిటోరియంలో ప్రసంగిస్తుండగా..
కాన్పూర్, డిసెంబర్ 24: ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ పాఠాలు చెబుతూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్‌లో విషాదం నెలకొంది. స్టూడెంట్ అఫైర్స్ డీన్, మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ (55) శుక్రవారం (డిసెంబర్ 22) సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇన్‌స్టిట్యూట్ ఆడిటోరియంలో ప్రసంగిస్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వేదికపై ప్రసంగిస్తుండగా విపరీతంగా చెమటలు పట్టాయి. అనంతరం ఛాతినొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయనలో చలనం కనిపించకపోవడంతో హుటాహుటీన కార్డియాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి చనిపోయినట్లు ప్రకటించారు. ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ 2019 నుండి కొలెస్ట్రాల్‌కు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆయన హఠన్మరణంలో ఇన్‌స్టిట్యూట్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. కుమారుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతోన్న ఆయన కుమారుడు వచ్చాక ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ ఎంతో ఫిట్‌గా ఉంటాడని, ఆయన ఆకస్మిక మరణం గురించి విన్న తర్వాత షాక్‌కు గురయ్యాడని ఇన్‌స్టిట్యూట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు తెలిపారు. ఖండేకర్ మృతి పట్ల మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ అభయ్ కరాండీకర్, ఐఐటీ కాన్పూర్‌లోని పలువురు సీనియర్ ప్రొఫెసర్లు సంతాపం తెలిపారు. IIT ఆడిటోరియంలో జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశానికి ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ హరీష్ చంద్ర వర్మతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సాయంత్రం 6:00 గంటల ప్రాంతంలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ప్రొఫెసర్ ఖండేకర్ కుప్పకూలిపోయారని ప్రొఫెసర్ వర్మ తెలిపారు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో చదువుతున్న ఆయన కుమారుడు ప్రవాహ ఖండేకర్ వచ్చిన తర్వాత ప్రొఫెసర్ ఖండేకర్ అంత్యక్రియలు జరగనున్నాయి.
It’s unbelievable! The news of my friend Prof. Sameer Khandekar’s (Professor in Mechanical Engineering at IIT Kanpur) sudden and very untimely passing has left us in deep shock and sadness. A cherished colleague always full of energy and enthusiasm. Our thoughts are with his… pic.twitter.com/l8eTzdL5iA
— Abhay Karandikar (@karandi65) December 23, 2023
జబల్‌పూర్‌లో జన్మించిన ప్రొఫెసర్ ఖండేకర్ కాన్పూర్ IIT నుంచి BTech పూర్తి చేశారు.2004 జర్మనీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చదివారు. స్వదేశానికి వచ్చిన తర్వాత ఐఐటీ కాన్పూర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2009లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, 2014లో ప్రొఫెసర్‌గా.. 2020లో మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా నియమితులయ్యారు. 2023లో స్టూడెంట్ అఫైర్స్‌కు డీన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రొఫెసర్ ఖండేకర్‌కు తల్లిదండ్రులు, భార్య ప్రధాన్య ఖండేకర్, కుమారుడు ప్రవహ్‌లు ఉన్నారు.
With profound grief, we inform you of the sudden & untimely demise of our Beloved colleague Prof. Sameer Khandekar, Dean of Student Affairs & Prof, Dept of Mechanical Eng.
We mourn the loss of a humble soul & pray that God gives his family & friends strength to bear this loss. pic.twitter.com/EbPmEyG0D9
— Director_IITK (@Director_IITK) December 22, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.