AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి.. పెళ్లితో ఒక్కటైన ప్రేమ జంట!

పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ అబ్బాయి అక్కడి అమ్మాయిని ప్రేమించాడు. అనంతరం ఇరు కుటుంబాల్లోని పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని కరీంనగర్‌ నగరపాలక పరిధిలోని అల్గునూర్‌కు చెందిన అరుణ్‌కుమార్‌ స్థానికంగా డిగ్రీ వరకు చదువుకున్నాడు. పైచదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడే ఎంబీఏ చదువుతున్న శ్రీలంకకు చెందిన అజ్జూరా అనే అమ్మాయితో 2014లో అరుణ్‌కు పరిచయం

Telangana: తెలంగాణ అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి.. పెళ్లితో ఒక్కటైన ప్రేమ జంట!
Love Marriage
Srilakshmi C
|

Updated on: Dec 22, 2023 | 9:04 AM

Share

అల్గునూర్‌, డిసెంబర్‌ 22: పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ అబ్బాయి అక్కడి అమ్మాయిని ప్రేమించాడు. అనంతరం ఇరు కుటుంబాల్లోని పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని కరీంనగర్‌ నగరపాలక పరిధిలోని అల్గునూర్‌కు చెందిన అరుణ్‌కుమార్‌ స్థానికంగా డిగ్రీ వరకు చదువుకున్నాడు.  ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడే ఎంబీఏ చదువుతున్న శ్రీలంకకు చెందిన అజ్జూరా అనే అమ్మాయితో 2014లో అరుణ్‌కు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా అనతికాలంలో ప్రేమగా మారింది. తాజాగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకన్న ఈ జంట ఇరుకుటుంబాల్లోని పెద్దలకు తమ ప్రేమ విషయం తెలిపారు. ఇద్దరి కుటుంబాలు అంగీకారం తెలపడంతో గురువారం అల్గునూర్‌లో అరుణ్‌కుమార్‌ ఇంటి వద్ద వీరి వివాహం ఘనంగా జరిగింది. శ్రీలంక అమ్మాయితో తెలంగాణ అబ్బాయి వివాహమని తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున వీరి వివాహం చూడటానికి వచ్చారు.

మరో ఘటన.. గోదావరిలో దూకిన నవదంపతులు! శవమై తేలిన నవ వధువు

నవ దంపతులు గోదావరిలోకి దూకిన ఘటన పోడూరులోని పెనుగొండ గ్రామంలో వెలుగు చూసింది. ఈ ఘటనలో భర్త ఒడ్డుకు చేరుకోగా మృతదేహం గురువారం తెల్లవారుజామున జాలర్లకు దొరికింది. వివరాల్లోకెళ్తే.. పెళ్లైన ఐదు రోజులకే రామారావు మనవరాలు సత్యవాణి (19)ని కైలా శివరామకృష్ణకు ఇచ్చి డిసెంబర్‌ 15న పెద్దలు వివాహం చేశారు. ఏం జరిగిందో తెలియదు మంగళవారం దంపతులు ఇరువురు గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో శివరామకృష్ణ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా.. సత్యవాణి గల్లంతైంది. గురువారం ఆమె మృతదేహం లభ్యంకాగా భర్త శివరామకృష్ణ హత్య చేసి ఉంటాడని యువతి బంధువులు గురువారం జాతీయ రహదారిపై బైఠాయించి న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపితే నిజాలు తెలుస్తాయని, భర్త శివరామకృష్ణ తమ అదుపులోనే ఉన్నాడని తగిన న్యాయం చేస్తామని సీఐ నాగేశ్వరరావు, ఏస్సై రమేష్‌ భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతురాలి తాత మెల్లు రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్‌ తెలిపారు. పోలీసుల విచారణలో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదనీ, వధువు దాంపత్యానికి సహకరించలేదని.. అందుకే ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని శివరామకృష్ణ పోలీసులకు వెల్లడించారు. బ్రిడ్జిపై నుంచి దూకినప్పుడు శివరామకృష్ణ కిలోమీటరు మేర ఎలా ఈదగలిగాడు, అతడిని బయటకు తీసినచోట వధువు చెప్పులు ఉండటం, మృతురాలి శరీరంపై బంగారు ఆభరణాలు ఏమయ్యాయి.. వంటి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.