Terrorists Mysterious Deaths: పాక్‌లో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల వరుస హత్యలు.. ఎవరా మిస్టీరియస్ వ్యక్తి?
భారత్ నుంచి పారిపోయిన దావూద్ ఇబ్రహీంతోపాటు పలువురు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా భారత్ హిట్ లిస్టులో ఉన్న టెర్రరిస్టులు వరుస హత్యలకు గురవుతున్నారు. భారత్‌కు అన్యాయం చేసిన వారిని ఎవరో టార్గెట్ చేసి మరీ హతమర్చుతున్నారు. దీని వెనుక ఎవరి హస్తం ఉంది? వారి మోటో ఏంటి అనే విషయం ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది. గడచిన రెండేళ్లలో ఢిల్లీ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న క్రమినల్స్ పాక్‌లోని..
ఇస్లామాబాద్, డిసెంబర్ 20: భారత్ నుంచి పారిపోయిన దావూద్ ఇబ్రహీంతోపాటు పలువురు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా భారత్ హిట్ లిస్టులో ఉన్న టెర్రరిస్టులు వరుస హత్యలకు గురవుతున్నారు. భారత్‌కు అన్యాయం చేసిన వారిని ఎవరో టార్గెట్ చేసి మరీ హతమర్చుతున్నారు. దీని వెనుక ఎవరి హస్తం ఉంది? వారి మోటో ఏంటి అనే విషయం ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది. గడచిన రెండేళ్లలో ఢిల్లీ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న క్రమినల్స్ పాక్‌లోని వివిధ ప్రాంతాల్లో మిస్టీరియస్‌గా చనిపోవడం అంతుపట్టకుంది. ఈ హత్యలపై పాక్ పెంచి పోషిస్తున్న నిషేదిత తీవ్రవాద సంస్థలు మౌనం వహించడం మరిన్ని అనుమానాలకు తీవిస్తోంది. హతమైన మిలిటెంట్ కమాండర్లందరూ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), హిజ్బుల్ ముజాహిదీన్ (హుమ్), జైషే మహమ్మద్ (జేఎం)తో సంబంధం ఉన్న వారే. నవంబర్ మొదటి పక్షం రోజుల్లో మౌలానా మసూద్ అజార్ సన్నిహిత సహచరుడు, ఎల్‌ఈటీ చీఫ్ రిక్రూటర్‌తో సహా ముగ్గురు సీనియర్ జేఈఎమ్ ఉగ్రవాదులు కాల్చి చంపబడ్డారు. 2021లో లాహోర్‌లో ఎల్‌ఈటీ వ్యవస్థాపకుడు, 2008 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత నుంచి ఈ హత్యల పరంపర ప్రారంభమైంది. పైగా ఈ హత్యలన్నీ ఒకే పద్ధతిలో ఉండటం మరో విశేషం. ప్రతి సందర్భంలోనూ గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌లపై వచ్చి భారత్‌లో తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని తుపాకులతో కాల్పులు జరుపుతున్నారు. పాక్‌లో జరుగుతోన్న ఈ వరుస హత్యలపై పాకిస్థాన్ అధికారులతోపాటు మీడియా కూడా పెదవి విప్పడం లేదు.
భారత్ టెర్రరిస్టుల వరుప హత్యలపై పాక్ మౌనం అందుకేనా?
హఫీజ్ సయీద్ లాహోర్ నివాసం వెలుపల బాంబు దాడి తర్వాత 2021లో అప్పటి పాకిస్తాన్ అంతర్గత మంత్రి రాణా సనావుల్లా విలేకరుల సమావేశంలో ఈ విషయమై మాట్లాడేందుకు నిరాకరించారు. ఇస్లామాబాద్ LeT, JeM, HuM, ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమంతో సంబంధం ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా పరిగణిస్తున్న వారి గుర్తింపులను దాచడానికి పాకిస్తాన్ మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ మూలాల ప్రకారం.. పాక్‌లోని ఇస్లామాబాద్‌లో న్యూ ఢిల్లీ ప్రచురించిన ఉగ్రవాదుల ఆచూకీ లభ్యమైనట్లు తెల్పింది. వీరిలో చాలా మందిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) ఒత్తిడి కారణంగా ఈ తీవ్రవాదుల హత్యల గురించి బయటి ప్రపంచానికి తెల్పేందుకు ఇస్లామాబాద్ విముఖత చూపుతోంది. మరణించిన వారిలో ఎవరినీ ఉగ్రవాదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం గానీ, అక్కడి మీడియా గానీ గుర్తించలేదు. నవంబర్ 13న కరాచీలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన ‘జిహాదీ’ మౌలానా మసూద్ అజార్ సన్నిహిత సహచరుడు మౌలానా రహీం ఉల్లా తారిఖ్‌నుస్థానిక మత గురువు హత్యగా అక్కడి మీడియా చిత్రీకరించింది. LeT మాజీ ఉగ్రవాది అక్రమ్ ఖాన్, LeT రిక్రూట్‌మెంట్ సెల్ హెడ్ అక్రమ్ ఘాజీలను ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని బజౌర్ గిరిజన జిల్లాలో నవంబర్ 9న గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. వీరిని కూడా ఉగ్రవాదులుగా కాకుండా ముజిన్‌లుగా పాకిస్తానీ మీడియా పేర్కొంది.
పాక్‌లో హత్యకు గురైన భారత్ టెర్రరిస్టులు వీరే..
- నవంబర్ 5న మియాన్ ముజాహిద్ అలియాస్ ఖ్వాజా షాహిద్‌ను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖకు సమీపంలో కిడ్నాప్ అయ్యాడు. తరువాత అతని మృతదేహం తల లేకుండా లభ్యమైంది. అతను సుంజువాన్‌లోని ఇండియన్ ఆర్మీ క్యాంప్‌పై 2018 ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి.
- 2016 పఠాన్‌కోట్ దాడికి ప్రధాన సూత్రధారి అయిన షాహిద్ లతీఫ్‌ను ఈ ఏడాది అక్టోబర్‌లో పాకిస్తాన్ పంజాబ్‌లోని సియాల్‌కోట్‌లో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ దాడిలో లతీఫ్‌తోపాటు అతని సహచరుడు కూడా మృతి చెందగా, మరో సహచరుడు గాయపడ్డాడు.
- 2023 సెప్టెంబర్‌లోఇతర కీలక ఉగ్రవాదులను గుర్తుతెలియని ముష్కరులు కాల్చి చంపారు. ధంగ్రీ ఉగ్రదాడి సూత్రధారిలో రియాజ్ అహ్మద్ (అలియాస్ అబూ ఖాసిం) పీఓకేలోని ఒక మసీదులో హతమయ్యాడు.
- సెప్టెంబరు 2023లో కరాచీలోని గులిస్తాన్-ఎ-జౌహర్ పరిసరాల్లో లష్కరేటర్‌కి చెందిన మౌలానా జియావుర్ రెహ్మాన్ హత్యకు గురయ్యాడు.
- సెప్టెంబరు 2023లో కరాచీలోని సోహ్రాబ్ గోత్‌లో ఎల్‌ఈటీకి చెందిన ముఫ్తీ ఖైజర్ ఫరూఖీ హత్యకు గురయ్యాడు.
- ఆగస్ట్ 2023: ముల్లా సర్దార్ హుస్సేన్ అరైన్, జమాత్-ఉద్-దవా, నవాబ్ షా జిల్లా సింధ్‌లో కాల్చి చంపారు.
- మే 2023: ఖలిస్తాన్ కమాండో ఫోర్స్‌కు చెందిన పాకిస్తాన్ నాయకుడు పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్ లాహోర్‌లోని జోహార్ టౌన్‌లో హత్య చేశారు.
- మార్చి 2023: హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన బషీర్ అహ్మద్ పీర్ (అలియాస్ ఇంతియాజ్ ఆలం) రావల్పిండిలో హత్యకు గురయ్యాడు.
- మార్చి 2023: ఖైబర్ గిరిజన జిల్లాలో ప్రముఖ జిహాదిస్ట్ సయ్యద్ నూర్ హత్యకు గురయ్యాడు.
- ఫిబ్రవరి 2023: కరాచీలో అల్-బదర్ ముజాహిదీన్‌కు చెందిన సయ్యద్ ఖలీద్ రజా హత్యకు గురయ్యాడు.
- మార్చి 2022: ఖాట్మండు నుంచి ఢిల్లీకి వెళ్లిన ఐదుగురు హైజాకర్లలో జేఈఎమ్‌కి చెందిన మిస్త్రీ జహూర్ ఇబ్రహీం (అలియాస్ జాహిద్ అఖుంద్) కరాచీలో హత్యకు గురయ్యాడు.
దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం వెనుక ఉన్న మిస్టరీ వ్యక్తులెవరు?
తాజాగా దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం వార్తల్లో నిలవడంతో పాకిస్థాన్‌లో వరుస హత్యలపై ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతోంది. ఏడాదిగా పాకిస్థాన్‌కు చెందిన భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు వరుసగా హత్యలకు గురవుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై రావడం.. టార్గెట్ చేసిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపించడం.. ఈ హత్యలన్నింటిలోనూ కామన్‌గా కనిపిస్తోంది. పాకిస్థాన్ భద్రతాదళాలు ఈ హత్యలకు పాల్పడినవారిని గుర్తించడం కానీ, అరెస్టు చేయడం కానీ ఇప్పటిదాకా జరగలేదు. నేపాల్‌లో జరిగిన ఓ ఐఎస్‌ఐ ఏజెంట్ హత్యలో మాత్రం పాక్ ముగ్గురిని అరెస్టు చేసింది. ఫిబ్రవరిలో రావల్పిండిలో అలమ్ హత్యతో ఈ హత్యల పరంపరం మొదలయింది. హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాది బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ అలమ్‌ను ఫిబ్రవరిలో గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. రావల్పిండిలోని ఓ షాపు దగ్గర పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో అలమ్‌పై కాల్పులు జరిపారు. పాకిస్థాన్‌లో హిజ్బుల్ లాంచింగ్ చీఫ్‌గా ఉన్న అలమ్.. జమ్ముకశ్మీర్‌లోకి పేలుడుపదార్థాలు, ఆయుధాలు అక్రమంగా తరలించేవాడు. గత ఏడాది అక్టోబరులో భారత్ అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. అలమ్ హత్య జరిగిన ఆరురోజుల తర్వాత విద్యావేత్త సయ్యద్ ఖలీద్ రజాను గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఖలీద్ రజా తలపై కాల్పులు జరిపి పరారయ్యారు. అతని ఇంటి దగ్గర పార్క్ చేసి ఉన్న కారు దగ్గరకు వెళ్తుండగా రజాపై కాల్పులు జరిపారు. సింథి టెర్రరిస్ట్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.
జహీద్ అక్‌హండ్ పేరుతో పాక్‌లో నివస్తున్న జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాది మిస్త్రీ జహూర్ ఇబ్రహీమ్ మార్చి 1న హత్యకు గురయ్యాడు. కరాచీలో అతన్ని హత్య చేశారు. ఖలిస్థాన్ కమాండ్ ఫోర్స్ చీఫ్‌గా ఉన్న పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్ కూడా ఈ మార్చిలో లాహోర్‌లోని అతని ఇంటి దగ్గర హత్యకు గురయ్యాడు. ముంబై అల్లర్ల సూత్రధారి హఫీజ్ సయీద్ అనుచరుడు సర్దార్ హుస్సేన్ అరైన్ సింధ్‌లో ఆగస్టు 1న హత్యకు గురయ్యాడు. జనవరిలో రాజౌరి జిల్లాలో దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్లో ఒకరైన అబు ఖాజిమ్ కశ్మీరీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మసీదులో ప్రార్థనలు చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ISI ఏజెంట్‌టా భావించే లాల్ మహ్మద్ అలియాస్ మహ్మద్ దర్జీ నేపాల్ రాజధాని ఖాట్మండులో సెప్టెంబరు 19న హత్యకు గురయ్యాడు. లష్కరే తోయిబా సభ్యుడు మౌలానా జిహార్ రెహ్మాన్ కూడా ఇలాగే హత్యకు గురయ్యాడు. జైషే మహ్మద్ ఉగ్రవాది షహీద్ లతీఫ్, మౌలానా మజూద్ అజ్‌హర్ సన్నిహితుడు దావూద్ మాలిక్, ఖ్వాజా షాహిద్, అక్రమ్ ఖాన్ ఘాజీ, మౌలానా రహీమ్ ఉల్లాహ్ తరీఖ్.. ఇలా భారత్ హిట్ లిస్టులో ఉన్న ఉగ్రవాదులంతా పాక్‌లోనే హత్యకు గురయ్యారు. ఈ వరుస హత్యల వెనక ఉన్న వారు ఎవరనేది మిస్టరీగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.