AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Depression: డిప్రెషన్‌కు-విచారానికి తేడా తెలుసా? ఈ లక్షణాలు 2 వారాలకు మించి కన్పిస్తే ఆలస్యం చేయకండి..

ఈ రోజుల్లో డిప్రెషన్ అనేది సాదారణమై పోయింది. నేటి యువత డిప్రెషన్‌తో సతమతమవుతున్నారు. అయితే డిప్రెషన్, విచారం రెండు ఒకటి కాదు. ఇవి భిన్నంగా ఉంటాయి. విచారం, నిరాశ మధ్య తేడా ఏమిటో? డిప్రెషన్ ఎందుకు ప్రమాదకరం, దానిని ఎలా గుర్తించాలో అర్థం చేసుకోవాలి? వంటి నిపుణులు ఏం చెబుతున్నారో పరిశీలిద్దాం..

Depression: డిప్రెషన్‌కు-విచారానికి తేడా తెలుసా? ఈ లక్షణాలు 2 వారాలకు మించి కన్పిస్తే ఆలస్యం చేయకండి..
Depression
Srilakshmi C
|

Updated on: Dec 19, 2023 | 12:33 PM

Share

ఈ రోజుల్లో డిప్రెషన్ అనేది సాదారణమై పోయింది. నేటి యువత డిప్రెషన్‌తో సతమతమవుతున్నారు. అయితే డిప్రెషన్, విచారం రెండు ఒకటి కాదు. ఇవి భిన్నంగా ఉంటాయి. విచారం, నిరాశ మధ్య తేడా ఏమిటో? డిప్రెషన్ ఎందుకు ప్రమాదకరం, దానిని ఎలా గుర్తించాలో అర్థం చేసుకోవాలి? వంటి నిపుణులు ఏం చెబుతున్నారో పరిశీలిద్దాం..

దుఃఖం అంటే ఏమిటి?

విచారం అనేది ఒక సాధారణ భావోద్వేగం. ప్రతి వ్యక్తి తన జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ అనుభూతిని అనుభవిస్తాడు. అయితే, ఒక వ్యక్తిలో ఎక్కువ కాలం దుఃఖంగా ఉంటడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనల వల్ల తరచుగా విచారంగా ఉంటాడు. ప్రియమైన వ్యక్తి మరణం, ఇంటర్వ్యూను క్లియర్ చేయలేకపోవడం, తన కోరికలను నెరవేర్చుకోలేకపోవడం వంటి సంఘటనల కారణంగా వ్యక్తులు బాధపడుతుంటారు. దుఃఖం ఒక వ్యక్తి యొక్క రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయదు. కానీ డిప్రెషన్ అనేది విచారం కంటే చాలా భిన్నమైనది. ప్రమాదకరమైనది.

డిప్రెషన్ అంటే ఏమిటి?

డిప్రెషన్ అనేది ఒక మానసిక రుగ్మత. దానికి సకాలంలో చికిత్స చేయడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి నిరుత్సాహానికి గురైనప్పుడు, అతను నిరంతరం బాధపడటం ప్రారంభిస్తాడు. కానీ డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తి ఇతరుల ముందు బాధపడుతున్నట్లు కనబడడు. ఒక వ్యక్తి డిప్రెషన్‌లో ఉంటే అతను అందరితో నవ్వుతూ మాట్లాడుతాడు. కానీ లోపల మాత్రం విచారంగా ఉంటాడు. ఆ విధంగా డిప్రెషన్ ఒక వ్యక్తి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది.

ఇవి కూడా చదవండి

డిప్రెషన్ లక్షణాలు

మీరు ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా వారాలపాటు విచారంగా ఉంటే, డిప్రెషన్‌తో బాధపడుతున్నారని అర్ధం. అయితే డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తి ఎప్పుడూ చెడు మానసిక స్థితిలో తనను తాను బాధపెట్టుకుంటూ ఉంటాడు. డిప్రెషన్‌కు గురైతే, దేనిపైనా ఆసక్తి ఉండదు. అలాగే నిద్ర, ఇతర దినచర్యలు మారడం ప్రారంభిస్తాయి. కొంతమంది కావాల్సిన దానికంటే ఎక్కువ నిద్రపోవడం ప్రారంభిస్తారు. రాత్రంతా నిద్రపోయాక కూడా తమకు శక్తి లేదన్న భావన కలుగుతుంది. అయితే మరికొందరు నిద్రను పూర్తిగా కోల్పోతారు. వారు పగలు, రాత్రి నిద్రపోరు. నిద్రతో పాటు, ఆహారం అలవాట్లు కూడా మారడం ప్రారంభమవుతుంది. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తిలో ఈ లక్షణాలన్నీ చాలా కాలం పాటు కొనసాగుతాయి. ఈ లక్షణాలు 2 వారాల కంటే ఎక్కువగా ఉంటే, మనస్తత్వవేత్తను సంప్రదించాలి. మనస్తత్వవేత్తలు వివిధ పరీక్షలను నిర్వహించి, మెడిసిన్‌ ఇస్తారు. డిప్రెషన్‌కు సకాలంలో చికిత్స అందకపోతే, అది ప్రమాదకర పరిస్థితిలో పడేస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.