- Telugu News Photo Gallery Make new decorations for your home this Christmas, check here is details in Telugu
Christmas Home Decoration: ఈ క్రిస్మస్ కి మీ ఇంటికి ఇలా కొత్తగా డెకరేషన్ చేసుకోండి!
క్రిస్మస్ ఫెస్టివల్ రాగానే చాలా మంది రంగు రంగుల లైట్స్ తో ఇంటిని అలంకరిస్తారు. ఈ కలర్ ఫుల్ లైట్స్ వల్ల మీ ఇంటికే గుడ్ లుక్ వస్తుంది. మరి ఈసారి డెకరేషన్ చేసేటప్పుడు ఈ టిప్స్ కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. డెకరేషన్ ఏదైనా.. అందులో కాస్త ఇన్నోవేటీవ్ టచ్ ఉండాలి. ఒకే ఐటెమ్ ని రెండు, మూడు రకాలుగా యూజ్ చేసే విధంగా ఉండాలి. అలాగే కొన్ని చిన్న చిన్న మార్పులే మీ ఇంటికి మంచి లుక్ ని ఇస్తుంది. మీరు క్రిస్మస్ ట్రీ పెట్టే ప్రదేశం కూడా..
Chinni Enni | Edited By: Shaik Madar Saheb
Updated on: Dec 19, 2023 | 9:35 PM

సాధారణంగా పండుగలకు ఇంటిని అలంకరించు కోవడం కామనే. కానీ కొత్తగా, ట్రెండీగా చేయాలంటే కాస్త శ్రమ పడాల్సిందే. అంతే కాకుండా మంచి ఐడియాలు కూడా రావాలి. మీరు కూడా మీ ఇంటికి కొత్తగా అలంకరించుకుందాం అనుకుంటే మాత్రం.. స్పెషల్ గా ఈ టిప్స్ మీకోసమే. ఈ చిట్కాలు మీ ఇంటి లుక్ నే మార్చేస్తాయి.

అంతే కాకుండా అందంగా కనిపించేలా చేస్తాయి. క్రిస్మస్ ఫెస్టివల్ రాగానే చాలా మంది రంగు రంగుల లైట్స్ తో ఇంటిని అలంకరిస్తారు. ఈ కలర్ ఫుల్ లైట్స్ వల్ల మీ ఇంటికే గుడ్ లుక్ వస్తుంది. మరి ఈసారి డెకరేషన్ చేసేటప్పుడు ఈ టిప్స్ కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

డెకరేషన్ ఏదైనా.. అందులో కాస్త ఇన్నోవేటీవ్ టచ్ ఉండాలి. ఒకే ఐటెమ్ ని రెండు, మూడు రకాలుగా యూజ్ చేసే విధంగా ఉండాలి. అలాగే కొన్ని చిన్న చిన్న మార్పులే మీ ఇంటికి మంచి లుక్ ని ఇస్తుంది. మీరు క్రిస్మస్ ట్రీ పెట్టే ప్రదేశం కూడా అందరికీ కనిపించేలా సెట్ చేయండి. కలర్ ఫుల్ లైట్ లు ఉండేలా చూసుకోండి.

చాలా మంది ఇప్పుడు చిన్న చిన్న మొక్కలను ఇంట్లోనే పెంచుకుంటున్నారు. మొక్కల కుండీలకు మంచి డార్క్ కలర్ కలర్స్ వేస్తే నైట్ టైమ్ లో కూడా బాగా ఎలివేట్ అవుతాయి. ఆ మొక్కలను కూడా ఇంట్లో అక్కడక్కడా పెట్టి లైటింగ్ పెడితే.. వావ్ అనాల్సిందే. అదే విధంగా బెలూన్స్, రక రకాల బాల్స్ కూడా మంచి లుక్ ని ఇస్తాయి.

మీ ఇంటి లుక్ ని మార్చడంలో పూలు కూడా బాగా ఉపయోగ పడతాయి. కాబట్టి అక్కడక్కడ పూలతో చిన్న డెకరేషన్ చేయండి. అలాగే మంచి సువాసనలతో నిండిన ఫ్యాబ్రిక్స్ కూడా మీ మూడ్ ని మార్చేస్తాయి. వీటి కోసం మంచి స్మెల్ వచ్చే క్యాండిల్స్ ని అక్కడక్కడ పెట్టండి.





























