Racharikam: విజయ్ శంకర్, అప్సరా రాణి జంటగా సురేష్ లంకలపల్లి తెరకెక్కిస్తున్న సినిమా రాచరికం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా.. నిర్మాత డీఎస్ రావు కెమెరా స్విస్ ఆన్ చేశారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.