- Telugu News Photo Gallery You can lose weight easily by eat chewing gum, check here is details in Telugu
Weight Loss: చూయింగ్ గమ్ నములుతూ కూడా బరువు తగ్గొచ్చా..? వాస్తవం ఏంటో తెలుసుకోండి..
బరువు పెరిగినంత సులభంగా వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా కష్టం. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితం దానికి తోడు లైఫ్ స్టైల్ మారడం, ఆహార విధానంలో మార్పులు రావడం వల్ల బరువు తగ్గడం కష్టంగా మారుతోంది. బరువు తగ్గేందుకు ఇప్పటికే ఎన్నో టిప్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు మరో చిట్కా ఏంటంటే.. చూయింగ్ గమ్. ఇది అంటే ఇష్టం ఉండని వారెవరూ ఉండరు. చూయింగ్ గమ్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతో ఇష్టంగా తింటూ..
Chinni Enni | Edited By: Janardhan Veluru
Updated on: Dec 20, 2023 | 3:05 PM

బరువు పెరిగినంత సులభంగా వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా కష్టం. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితం దానికి తోడు లైఫ్ స్టైల్ మారడం, ఆహార విధానంలో మార్పులు రావడం వల్ల బరువు తగ్గడం కష్టంగా మారుతోంది. బరువు తగ్గేందుకు ఇప్పటికే ఎన్నో టిప్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు మరో చిట్కా ఏంటంటే.. చూయింగ్ గమ్. ఇది అంటే ఇష్టం ఉండని వారెవరూ ఉండరు. చూయింగ్ గమ్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.

కొంత మంది నోటి దుర్వాసనను తగ్గించు కోవడానికి తింటారు. ఇంకొంత మంది సరదగా టైమ్ పాస్ అవ్వడానికి తింటారు. కానీ ఈ చూయింగ్ గమ్ తో బరువు తగ్గొచ్చన్న విషయం చాలా మందికి తెలీదు. చూయింగ్ గమ్ తినడం వల్ల.. చిరు తిండి తినాలన్న కోరికను రాకుండా చేస్తుందని తాజాగా రీసెర్చ్ లో తేలింది.

చూయింగ్ గమ్ ను నమలడం వల్ల శరీరంలో కేలరీలను కూడా బర్స్ చేయడంలో హెల్ప్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చూయింగ్ గమ్ తింటున్నప్పుడు కింది దవడ అనేది కదులుతూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల కేలరీల బర్న్ ను పెంచుతుందట.

చాలా మందికి భోజనం తిన్న తర్వాత ఏదైనా తినాలని అనిపిస్తుంది. దీంతో స్వీట్లు, ఐస్ క్రీమ్స్ వంటివి తినేస్తారు. దీంతో వెయిట్ పెరుగుతూ ఉంటారు. అలాంటప్పుడు చూయింగ్ గమ్ తినడం వల్ల.. అలాంటి కోరికలను కంట్రోల్ అవుతాయి. దీంతో బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

అలాగే పదే పదే చిరు తిండి తినే వారు కూడా తప్పకుండా చూయింగ్ గమ్ తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో చిరు తిండి తినాలన్న ఆలోచన నశిస్తుంది. ఈ విధంగా చూయింగ్ గమ్ తో ఈజీగా బరువు తగ్గొచ్చు.





























