- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu Guntur Karam to Kalyan Ram Devil latest movie updates from industry
Movie Updates: గుంటూరు కారం ఆఖరి పాట షూటింగ్.. ‘డెవిల్’ కొత్త పాట విడుదల..
మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న సినిమా డెవిల్. సినిమా సినిమాకూ యాక్షన్ డోస్ పెంచుతున్నారు నటి దీపిక పదుకోన్. ణ్‌వీర్‌సింగ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ప్రభాస్ సలార్ సెట్లో అడుగుపెట్టగానే అందరిలోనూ ఓ ఎనర్జీ వస్తుందని అన్నారు నటి శ్రుతిహాసన్.
Updated on: Dec 20, 2023 | 3:34 PM


నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న సినిమా డెవిల్. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ నెల 29న విడుదల కానుంది ఈ సినిమా. దూరమే తీరమై.. నింగి తాకే నేలని అనే గీతాన్ని లేటెస్ట్ గా విడుదల చేశారు మేకర్స్. బ్రిటిష్ హయాంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన కథతో తెరకెక్కుతోంది డెవిల్

సినిమా సినిమాకూ యాక్షన్ డోస్ పెంచుతున్నారు నటి దీపిక పదుకోన్. త్వరలోనే ఓ యాక్షన్ థ్రిల్లర్ వెబ్‌సీరీస్‌లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఫైటర్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు దీపిక పదుకోన్

రణ్‌వీర్‌సింగ్‌కి అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన విగ్రహాల్ని ఏర్పాటు చేశారు. ప్రముఖులకు విగ్రహాలుండే చోట, తనకు రెండు విగ్రహాలు ఉండటం ఆనందంగా ఉందని అన్నారు రణ్‌వీర్‌సింగ్.

ప్రభాస్ సలార్ సెట్లో అడుగుపెట్టగానే అందరిలోనూ ఓ ఎనర్జీ వస్తుందని అన్నారు నటి శ్రుతిహాసన్. ప్రభాస్‌కీ, ప్రశాంత్ నీల్‌కీ మధ్య ఉన్న కామన్ పాయింట్ అదేనని చెప్పారు. ప్రభాస్‌తో తాను ఎక్కువగా మ్యూజిక్, జనరల్ నాలెడ్జ్ గురించి మాట్లాడేదాన్నని అన్నారు. ప్రభాస్ చాలా ఓపిగ్గా వింటూ, స్మైల్ ఇచ్చేవారని చెప్పారు శ్రుతిహాసన్.




