AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బంగారం రేట్లు మరోసారి పతనం.. స్వల్పంగా పడిపోయిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

దేశంలో బంగారం ధరలు మళ్లీ కుప్పకూలాయి. గత నాలుగు రోజులుగా రేట్లు పతనమవుతూనే ఉన్నాయి. దీంతో కొనుగోలు చేసేవారికి ఊరట దక్కినట్లయింది. బుధవారం గోల్డ్ రేటు ఏకంగా రూ.3 వేలు తగ్గగా.. గురువారం కూడా స్వల్పంగా తగ్గింది. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold Prices: బంగారం రేట్లు మరోసారి పతనం.. స్వల్పంగా పడిపోయిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
Gold Silver
Venkatrao Lella
|

Updated on: Mar 05, 2026 | 6:41 AM

Share

మహిళలకు గుడ్ న్యూస్. బంగారం ధరల పడిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా గోల్డ్ రేట్లలో భారీగా తగ్గుదల నమోదవుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం, పశ్చిమాసియాలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పసిడి ధరలు పెరుగుతాయోమోనని మార్కెట్ వర్గాలు ఊహించాయి. కానీ అందుకు భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయి. పసిడి ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ రావడంతో బంగారం కొనుగోలు చేసేవారు పెరిగిపోతున్నారు. దీంతో గోల్డ్ షాపులకు కూడా గిరాకీ పెరిగింది. ఇప్పుడు ధరలు తగ్గుతుండటంతో గోల్డ్ షాపులు కళకళలాడుతున్నాయి. గురువారం పసిడి ధరలు మరోసారి కుప్పకూలాయి. దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

బంగారం ధరలు ఇలా..

-హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,64,500 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,64,510 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,50,790 వద్ద ఉండగా.. బుధవారం రూ.1,50,800గా ఉంది

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రూ.1,64,500 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,50,790 వద్ద ఉంది

-బెంగళూరులో 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ రేటు రూ.1,64,500 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,50,790 వద్ద ట్రేడవుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే రూ.1,65,810 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,51,990 వద్ద ట్రేడవుతోంది

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,64,650గా ఇప్పుడు కొనసాగుతోండగా.. బుధవారం దీని ధర రూ.1,64,660 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,50,940 వద్ద ఉండగా.. నిన్న దీని రేటు రూ.1,50,950 వద్ద ట్రేడవుతోంది.

ఇవాల్టీ వెండి ధరలు ఇవే..

-ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2,84,900గా ఉంది. నిన్న ఈ ధర రూ.2.85 లక్షల వద్ద ట్రేడవుతోంది.

-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర గురువారం రూ.2,94,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ రేటు రూ.2.95 లక్షలుగా ఉంది

-చెన్నైలో కేజీ సిల్వర్ ధర బుధవారం రూ.2.95 లక్షలుగా ఉండగా.. గురువారం నాటికి రూ.2,94,900 వద్ద ట్రేడవుతోంది

-బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2,84,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2.85 లక్షలుగా ఉంది

Follow Us