AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

LPG: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

Phani CH
|

Updated on: Aug 21, 2026 | 9:03 PM

Share

ఎల్పీజీ సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రణాళిక రూపొందించింది. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 21 రిఫైనరీలు, అప్‌స్ట్రీమ్ కంపెనీలకు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది. రోజువారీ వినియోగంలో 70 శాతం వరకు దేశీయంగా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో చర్యలు చేపడుతోంది. అంతర్జాతీయ సంక్షోభాల సమయంలోనూ వినియోగదారులకు నిరంతరంగా గ్యాస్ అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.

దేశంలో ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. భవిష్యత్తులో గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా, వినియోగదారులకు నిరంతరం సిలిండర్లు అందేలా కేంద్రం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధాల వల్ల దేశీయంగా గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు ఈ సరికొత్త ప్రణాళికకు రూపకల్పన చేసింది. ప్రస్తుతం భారత్ తన గ్యాస్ అవసరాల కోసం విదేశాలపై, ముఖ్యంగా గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. మన దేశానికి కావాల్సిన ఎల్పీజీలో దాదాపు 90 శాతం వరకు గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి అవుతోంది. అయితే, ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధాలు, ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హర్ముజ్ జలసంధి మూతపడటం వంటి పరిణామాలు గ్యాస్ సరఫరా వ్యవస్థను అతలాకుతలం చేశాయి. ఇలాంటి సంక్షోభ సమయాల్లో దేశంలో గ్యాస్ నిల్వలు తగ్గిపోయి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం గమనించింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, దేశీయంగానే గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి దేశంలోని 21 రిఫైనరీలు, అప్‌స్ట్రీమ్ కంపెనీలకు స్పష్టమైన టార్గెట్లు విధించింది. దేశంలో ఎల్పీజీ ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా కంపెనీలకు కొత్త లక్ష్యాలను నిర్దేశించారు. ప్రస్తుతం దేశంలో రోజువారీ గ్యాస్ వినియోగం సుమారు 91 వేల టన్నులుగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, రిఫైనరీలు రోజుకు 63,810 టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేయాలని కేంద్రం టార్గెట్ పెట్టింది. ఇది మొత్తం వినియోగంలో సుమారు 70 శాతానికి సమానం. ఈ సరికొత్త పథకం ద్వారా దేశంలోనే ఉత్పత్తి భారీగా పెరిగి, భవిష్యత్తులో ఎలాంటి అంతర్జాతీయ సంక్షోభాలు ఎదురైనా దేశంలో గ్యాస్ కొరత అనే సమస్యే తలెత్తదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాబోయే రోజుల్లో ఎల్పీజీ వినియోగదారులకు ఎంతో ఊరట లభించనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త! బ్యాంకుల ఇష్టారాజ్యానికి చెక్!

అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు

Irumudi Review: రవితేజ ఖాతాలో హిట్ పడిందా? లేదా ? ఇరుముడి రివ్యూ

Omkuchi Narasimhan: ఈ స్టార్ కమెడియన్ కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ అని తెలుసా?

Follow Us