AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omkuchi Narasimhan: ఈ స్టార్ కమెడియన్ కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ అని తెలుసా?

Omkuchi Narasimhan: ఈ స్టార్ కమెడియన్ కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ అని తెలుసా?

Phani CH
|

Updated on: Aug 21, 2026 | 8:56 PM

Share

బక్కపలచటి శరీరం, వింత హెయిర్‌స్టైల్‌, కీచు గొంతుతో ప్రేక్షకులను నవ్వించిన కమెడియన్ ఓంకుచి నరసింహన్ సినీ ప్రయాణం ఎంతో ప్రత్యేకం. బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించి, మళ్లీ సినిమాల్లోకి రావడానికి 30 ఏళ్లు పట్టింది. అనంతరం 1500కు పైగా చిత్రాల్లో నటించారు. అయితే ఆయన కుమారుడు ఓంకారేశ్వర మాత్రం సినిమా రంగాన్ని ఎంచుకోకుండా సన్యాసిగా మారి ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడం విశేషంగా మారింది.

కమెడియన్ ఓంకుచి నరసింహన్. ఈ పేరంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ బక్కచిక్కిన తన ఆకారం.. బట్టలతో వింతగా ఉంటే ఆయన జుట్టు చూస్తే మాత్రం.. అర్రె యానా అంటూ నవ్వేస్తారు. కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల మనుసు గెలుచుకున్న ఈయన జీవితం, సినీ ప్రస్థానం చాలా విభిన్నంగా ఉంటుంది. బక్కపలచటి ఆకారం, కీచు గొంతుతో సుమారు 1500లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆయన అసలు పేరు నరసింహన్ కాగా, ఓంకుచి అనేది జనంలో పాపులర్ అయిన పేరు.ఓంకుచి నరసింహన్ 1936లో తమిళనాడులోని కుంభకోణం నగరంలో జన్మించారు. 13వ ఏట అబ్బయ్య అనే చారిత్రక చిత్రంలో బాలనటుడిగా నటించినా, ఆ తర్వాత చదువుపైనే పూర్తిగా దృష్టి సారించారు. డిగ్రీ పూర్తి చేసి ఎల్ఐసిలో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచారు. సుదీర్ఘకాలం పాటు ఎల్ఐసిలో పనిచేసిన నరసింహన్, సరస్వతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. వారిలో ముగ్గురు కుమార్తెలు విజయలక్ష్మి, నిర్మల, సంగీత కాగా, ఒక కుమారుడు ఓంకారేశ్వర ఉన్నారు. బాలనటుడిగా ఒక సినిమా చేసిన తర్వాత, మళ్లీ వెండితెరపై కనిపించడానికి నరసింహన్‌కు 30 ఏళ్లు పట్టింది. తిరిగి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనకు తమిళ లెజెండరీ నటుడు సురులి రాజన్, దర్శకుడు విసు వంటి వారి మద్దతు లభించింది. పలు సినిమాల్లో అవకాశాలు కల్పించడంతో, కమెడియన్‌గా అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు శంకర్ వంటి వారి సినిమాల్లో నటించి ఎంతో మంచి పేరు సంపాదించారు. రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్ వంటి అగ్ర హీరోలందరితోనూ కలిసి నటించారు. తెలుగులోనూ ఓంకుచి నరసింహన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఈయన కుమారుడు మాత్రం ప్రస్తుతం సన్యాసిగా జీవితం సాగిస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఓంకుచి నరసింహన్ గారి కుమారుడు ఓంకారేశ్వర ప్రస్తుత వయస్సు 45 ఏళ్లకు పైమాటే. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా రంగంలో నటుడిగా రాణిస్తాడని అనుకుంటే ఆయనేమో.. సన్యాసిగా మారి ఆధ్యాత్మిక మార్గంలో జీవిస్తున్నారు. తనకు దేవుళ్లు కనిపిస్తారని, సాయిబాబా, జీసస్ వంటి దేవుళ్లు తనతో మాట్లాడతారని, వారే తనను ప్రభావితం చేశారని ఆయన చెబుతున్నారు. భక్తులకు దైవత్వం గురించి ప్రవచనాలు చెబుతూ, తాను ఎంచుకున్న జీవితానికి కారణం దేవుడు కనిపించడమేనని చెప్తుంటారు. తన కామెడీతో దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రేక్షకులను నవ్వించిన ఓంకుచి నరసింహన్, 2009 మార్చి 12న చెన్నైలో గొంతు క్యాన్సర్‌తో బాధపడుతూ మరణించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు!

వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా

Trisha Krishnan: లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

మటన్‌ అమ్మే పనిలో బిజీగా షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌.. తర్వాత ఏమైందంటే..

Anupama Parameswaran: నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..

Follow Us