ఆషికా రంగనాథ్.. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ అందం, అభినయంతో ప్రశంసలు అందుకుంది ఆషికా. ప్రస్తుతం నాసామిరంగ సినిమాలో నటిస్తుంది. అక్కినేని నాగార్జున జోడిగా నా సామిరంగ సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో వరలక్ష్మి పాత్రలో ఆషికా నటిస్తున్నట్లు ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.