AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Ruth Prabhu: మళ్లీపెళ్లిపై నెటిజన్‌ ప్రశ్న.. సామ్‌ రియాక్షన్‌ ఇదే!

దక్షిణాది స్టార్‌ హీరోయిన్‌ సమంత విడాకుల టాపిక్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చి వార్తల్లో నిలిచారు. వీకెండ్‌ సందర్భంగా 'ఆస్క్‌ మీ' సెషన్‌లో సమంతను ఓ అభిమాని 'మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోకూదు?' అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సామ్‌ సమాధానం చెబుతూ.. 2023 విడాకుల స్టాటిస్టిక్స్‌ను కాస్త వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు...

Samantha Ruth Prabhu: మళ్లీపెళ్లిపై నెటిజన్‌ ప్రశ్న.. సామ్‌ రియాక్షన్‌ ఇదే!
Samantha
Srilakshmi C
|

Updated on: Dec 18, 2023 | 10:20 AM

Share

దక్షిణాది స్టార్‌ హీరోయిన్‌ సమంత విడాకుల టాపిక్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చి వార్తల్లో నిలిచారు. వీకెండ్‌ సందర్భంగా ‘ఆస్క్‌ మీ’ సెషన్‌లో సమంతను ఓ అభిమాని ‘మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోకూదు?’ అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సామ్‌ సమాధానం చెబుతూ.. 2023 విడాకుల స్టాటిస్టిక్స్‌ను కాస్త వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు. గణాంకాల ప్రకారం అది బ్యాడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అని పేర్కొన్నారు. స్మైల్‌ ఎమోజీని జోడిస్తూ సమాధానం చెప్పారు.

‘కీ డివోర్స్‌ స్టాటిస్టిక్స్‌’ పేరిట సమంత షేర్‌ చేసిన ఇమేజ్‌లో 2023లో మొదటి పెళ్లి విడాకులు 50 శాతం ఉంది. రెండో, మూడోసారి పెళ్లిళ్ల విడాకులు 67 శాతం, 73 శాతంగా ఉంది. స్త్రీ, పురుషుల విషయంలోనూ ఈ రేటింగ్‌ ఇలానే ఉందట అని స్టాటిస్టిక్స్‌ను వివరించారు. ఆ తర్వాత ‘సామ్‌ మీరు దేవుడిని నమ్ముతారా?’ అని ఓ అభిమాని అడగ్గా నమ్ముతానని సమంత ఇన్‌స్టాలో సమాధానం చెప్పారు. ‘మీరు రోజూ చేసే దినచర్యలోనే మీ విజయ రహస్యం దాగి ఉంటుంది’ అనే కోట్‌ను కూడా పోస్టు చేశారు. రాబోయే కొత్త ఏడాదిలో మంచి ఆరోగ్యంతో ఉండబోతున్నట్లు నటి చెప్పుకొచ్చారు.

ఇక సినిమాల విషయానికొస్తే సిటాడెల్‌లో వెబ్‌సిరీస్‌లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్‌, డీకే దర్శకత్వం వహించిన సిటాడెల్‌ ఒరిజినల్‌ వెర్షన్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మేడెన్‌ నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, సమంత కొన్ని రోజుల క్రితం నిర్మాతగా మారారు. ‘ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా సామ్‌ ఇప్పటికే ప్రకటించారు. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ.. అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వజనీనమైన కథల్ని ఈ వేదికపై నిర్మించనున్నట్లు తెలిపారు. తెలుగులో సమంత చివరి సారిగా ఖుషి సినిమాలో అలరించారు. ఈ సినిమాలో విజయ్‌దేవర కొండతో సామ్ జోడీ కట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..