Telangana: మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆటో డ్రైవర్‌.. కట్నం విషయమై అత్తమామలతో లొల్లి! చివరకు కత్తితో పొడిచి..

అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడా యువకుడు. మరో యువతిని ప్రేమించి ఇంటి నుంచి వెళ్లిపోయి మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఏడాదిపాటు ఎవరికీ కనిపించకుండా బయటే ఉన్న ఈ దంపతులు తాజాగా ఊరికి చేరుకున్నారు. మూడో భార్య తల్లిదండ్రులను ఇంటికి పిలిపించుకుని తనకు కట్నం కావాలంటూ కొత్త నాటకం ప్రారంభించాడు. ఆ విషయమై మాట్లాడుతున్న క్రమంలో కోపోధ్రిక్తుడైన యువకుడు అత్తమామలను కత్తితో పొడిచాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

Telangana: మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆటో డ్రైవర్‌.. కట్నం విషయమై అత్తమామలతో లొల్లి! చివరకు కత్తితో పొడిచి..
Man Stabs Father In Law
Follow us

|

Updated on: Dec 17, 2023 | 4:07 PM

మహబూబ్‌నగర్‌, డిసెంబర్‌ 17: అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడా యువకుడు. మరో యువతిని ప్రేమించి ఇంటి నుంచి వెళ్లిపోయి మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఏడాదిపాటు ఎవరికీ కనిపించకుండా బయటే ఉన్న ఈ దంపతులు తాజాగా ఊరికి చేరుకున్నారు. మూడో భార్య తల్లిదండ్రులను ఇంటికి పిలిపించుకుని తనకు కట్నం కావాలంటూ కొత్త నాటకం ప్రారంభించాడు. ఆ విషయమై మాట్లాడుతున్న క్రమంలో కోపోధ్రిక్తుడైన యువకుడు అత్తమామలను కత్తితో పొడిచాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

మహబూబ్‌నగర్‌ మంగంపేట్‌తండాకు చెందిన సభావత్‌ సాగర్‌ అనే యువకుడు హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వనపర్తి జిల్లా ఖిల్లాఘణపూర్‌కు చెందిన ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో పురుటి నొప్పుడు వచ్చాయి. కానీ సారగ్ ఆమెను సకాలంలో ఆస్పత్రిలో చేర్పించకపోవడంతో ఆమె మృతి చెందింది. కొన్ని రోజుల తర్వాత ఖిల్లాఘణపూర్‌ పక్కనే ఉన్న మరో తండాకు చెందిన యువతిని ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భిణీగా ఉన్న సమయంలో సాగర్‌ మరో యువతిని ప్రేమించాడు. గండేడ్‌ మండలం పంచలింగాల్‌తండాకు చెందిన మోహన్‌, మంగమ్మల కూతురు మాయను ప్రేమించాడు. దీంతో ఏడాది క్రితం వీరిద్దరు ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. దీంతో మాయను సాగర్‌ మూడో వివాహం చేసుకున్నాడు. సంవత్సర కాలంగా వీరిద్దరూ ఇంటికి రాకుండా బయటనే ఉన్నారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు తండాకు రావాలని కోరారు.

ఈ నేపథ్యంలో మాయ, సాగర్‌ శనివారం మంగంపేట్‌తండాకు వచ్చారు. అయితే సాగర్‌ తనకు రూ.2లక్షలు కావాలని అత్తమామలను డిమాండ్‌ చేశాడు. అలా ఇస్తే స్థానికంగా ఆటో నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటానని చెప్పుకొచ్చాడు. ఈ విషయం మాట్లాడేందుకు రెండో భార్య, ఆమె తల్లిదండ్రులను కూడా పిలిపించాడు. డబ్బులు ఇచ్చేందుకు అత్తమామలు ఒప్పుకున్నారు. ఆనక వారు ఫోన్లో బంధువులతో ఈ విషయమై మాట్లాడుతుండగా కోపోద్రిక్తుడైన అల్లుడు సాగర్‌ అప్పటికే తెచ్చుకున్న కత్తితో అత్తమామలను పొడిచాడు. భయంతో వారు బిగ్గరగా అరవడంతో చుట్టుపక్కల చేరుకోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. కత్తిపోట్లతో గాయాలపాలైన అత్తమామలను వాహనంలో మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంలో నిందితుడికి అతని తల్లి సహకరించిందని గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.