Konda Surekha: సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రి కొండా సురేఖ.. తొలి సంతకం దేనిపైనో తెలుసా!

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు ఒకరొకరిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆదివారం రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు.

Konda Surekha: సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రి కొండా సురేఖ.. తొలి సంతకం దేనిపైనో తెలుసా!
Minister Konda Surekha
Follow us

|

Updated on: Dec 17, 2023 | 3:47 PM

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు ఒకరొకరిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆదివారం రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, దేవాదాయ, అటవీ, కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు, సిబ్బంది, రాజకీయ ప్రముఖులు కార్యక్రమానికి హాజరై మంత్రిని అభినందిచారు.

అనంతరం అటవీ శాఖ కార్యక్రలాపాలపై తొలి సమీక్షా సమావేశాన్ని మంత్రి సురేఖ నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పథకాలు, పనులపై అటవీ సంరక్షణ అధికారి ఆర్.ఎం. డోబ్రియల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంపుపై మంత్రి కొండా సురేఖ తొలి సంతకం చేశారు. ప్రస్తుతం రూ. 5 లక్షలుగా ఉన్న పరిహారం రూ. 10 లక్షలకు ప్రభుత్వం పెంచనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడుతాయని మంత్రి సురేఖ తెలిపారు. వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలకు ఏనుగులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేందుకు వీలుగా అనుమతిని ఇస్తూ మరో ఫైల్‌పై కూడా మంత్రి సంతకం చేశారు.

తెలంగాణకు హరితహారం ద్వారా ఇప్పటిదాకా జరిగిన పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలపై మంత్రి ఆరా తీశారు. కంపా నిధుల సాధన, ఈ పథకం ద్వారా చేపట్టిన పనులను మంత్రి కొండా సురేఖ అడిగి తెలుసుకున్నారు. అటవీ, దేవాదాయ శాఖలో ప్రస్తుత సిబ్బంది, కొత్తగా నియామకాలకు ఉన్న అవకాశాలను అడిగి తెలుసుకున్నారు.

తాను నిత్యం అందుబాటులో ఉంటానని, తన పరిధిలోని శాఖల సిబ్బంది, అధికారులు నిజాయితీగా పనిచేయాలని, జట్టుగా పనిచేసి లక్ష్యాలు సాధిద్దామని, పర్యావరణ రక్షణ, పచ్చదనం పెంపుపై అందురూ కార్యసాధకులుగా పనిచేయాలని మంత్రి పిలుపు నిచ్చారు. త్వరలోనే శాఖల వారీగా పూర్తి స్థాయి సమీక్షా సమావేశాలు చేపడతామని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో తయారు చేసిన పోస్టర్లను ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

ఆకులతో ఆరోగ్యం.. ఈ ఆకులను తీసిపారేయకండి.. ఈ విషయం తెలిస్తే..
ఆకులతో ఆరోగ్యం.. ఈ ఆకులను తీసిపారేయకండి.. ఈ విషయం తెలిస్తే..
యూట్యూబర్స్ ఫేక్ న్యూస్.. మండిపడ్డ డైరెక్టర్ లోకేష్..
యూట్యూబర్స్ ఫేక్ న్యూస్.. మండిపడ్డ డైరెక్టర్ లోకేష్..
ఈటాలీవుడ్ స్టార్ యాంకర్‌ను గుర్తు పట్టారా?అసలెందుకిలా మారిపోయింది
ఈటాలీవుడ్ స్టార్ యాంకర్‌ను గుర్తు పట్టారా?అసలెందుకిలా మారిపోయింది
వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగండి.. ఊహకందని లాభాలు
వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగండి.. ఊహకందని లాభాలు
జాతకంలో శని దోషమా..నివారణకు చేయాల్సిన పూజ, దానాలు ఏమిటంటే..
జాతకంలో శని దోషమా..నివారణకు చేయాల్సిన పూజ, దానాలు ఏమిటంటే..
టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఏంటీ.. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఆ హీరోయినా..
ఏంటీ.. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఆ హీరోయినా..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
ఈ సండే ఊహించని కంటెస్టెంట్ బయటకు.. షాక్‌లో బిగ్ బాస్ ఫ్యాన్స్
ఈ సండే ఊహించని కంటెస్టెంట్ బయటకు.. షాక్‌లో బిగ్ బాస్ ఫ్యాన్స్