AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mood-boosting fruits: మీకు కోపం ఎక్కువగా వస్తుందా? అయితే ఈ పండ్లు తినండి మనసు తేలికపడుతుంది

కొంత మందికి ప్రతి చిన్న విషయానికి విపరీతంగా కోసం వస్తుంటుంది. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, జీవనశైలి, పర్యావరణం వంటి అనేక అంశాలు మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. ఒక క్షణం ఆనందంగా ఉంటాం, ఆ మరుసటి క్షణం ఏదో కారణంగా బాధపడతాం. కానీ తరచుగా మానసిక కల్లోలం కొన్నిసార్లు మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి పరిస్థితుల్లో దానిని ఎదుర్కోవడం కష్టమవుతుంది. రోజువారి సమతుల్య ఆహారం, ధ్యానం, వ్యాయామం..

Mood-boosting fruits: మీకు కోపం ఎక్కువగా వస్తుందా? అయితే ఈ పండ్లు తినండి మనసు తేలికపడుతుంది
Mood Boosting Fruits
Srilakshmi C
|

Updated on: Dec 15, 2023 | 6:32 PM

Share

కొంత మందికి ప్రతి చిన్న విషయానికి విపరీతంగా కోసం వస్తుంటుంది. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, జీవనశైలి, పర్యావరణం వంటి అనేక అంశాలు మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. ఒక క్షణం ఆనందంగా ఉంటాం, ఆ మరుసటి క్షణం ఏదో కారణంగా బాధపడతాం. కానీ తరచుగా మానసిక కల్లోలం కొన్నిసార్లు మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి పరిస్థితుల్లో దానిని ఎదుర్కోవడం కష్టమవుతుంది. రోజువారి సమతుల్య ఆహారం, ధ్యానం, వ్యాయామం.. వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని రకాల పండ్లు మానసిక స్థితిని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అంటున్నారు. శరీరంలో మంచి హార్మోన్లను విడుదల చేసి మానసిక స్థితిని మెరుగుపరిచే నాలుగు రకాల పండ్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

అరటి పండు

అరటి పండు పౌష్టికాహారం మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అరటిపండ్లు మానసిక స్థితిని పెంచే అద్భుతమైన పండు. దీనిలో విటమిన్ B6 అధికంగా ఉండే అరటిపండు శరీరంలో సెరోటోనిన్ హార్మోన్‌ను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సెరోటోనిన్‌ను హ్యాపీ హార్మోన్ అని పిలుస్తారు. మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు, అభ్యాస సామర్థ్యం, ​​జ్ఞాపకశక్తి, సాధారణ శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడం, మంచి నిద్రను నిర్వహించడం, ఆకలిని నియంత్రించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

బెర్రీస్

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరం ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి సహాయపడతాయి. వీటిల్లోనిఅధిక స్థాయి విటమిన్ సి డోపమైన్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది. ఇది మెదడును మెరుగుపరచడంలో న్యూరోట్రాన్స్‌మిటర్‌గా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

నారింజ

నారింజ వంటి సిట్రస్ పండ్లలో అధిక విటమిన్ సి కంటెంట్‌ ఉంటుంది. ఇవి రోగనిరోధక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్‌మిటర్‌ల సంశ్లేషణలో కూడా పాత్ర పోషిస్తాయి. రోజువారి ఆహారంలో నారింజను చేర్చుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది, రిఫ్రెష్ శక్తిని అందిస్తుంది.

టొమాటో

చాలా మంది టొమాటోను కూరగాయగా భావిస్తారు కానీ నిజానికి ఇది ఒక పండు. కూరగాయ కాదు. టొమాటోలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మానవ శరీరానికి, మెదడుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టొమాటోలను తొక్కతో తింటే, వివిధ పోషకాలను అందుతాయి. శక్తి స్థాయిలను కూడా పెంచుతాయి.

మరిన్ని తాజా ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.