Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corruption Complaint: లంచం అడిగిన అధికారులపై ఫిర్యాదు చేయాలా? ఈ నెంబర్‌కు ఒక్క ఫోన్‌ కాల్ కొట్టండి..

అవినీతి సూచీ 2022 (Corruption Index 2022)లో ఈ ఏడాది నవంబర్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. అవినీతి సూచిలో 40 పాయింట్లతో భారత్‌ 85 పాయింట్లతో 24వ స్థానంలో ఉంది. దీన్ని బట్టి మన దేశంలో అవినీతికి పాల్పడుతున్న అధికారుల సంఖ్య తక్కువేమీ కాదని స్పష్టమవుతోంది. ఇంటర్నేషనల్‌ కరప్షన్‌ పర్‌సెప్షన్స్‌ ఇండిక్స్‌ (CPI) ప్రకారం.. 12 పాయింట్లతో సోమాలియా ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి దేశంగా నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో సిరియా, సౌత్‌ సూడాన్‌, వెనుజులా, యెమిన్‌, నార్త్‌ కొరియా, బురుండి, హైతీ, లిబియా..

Corruption Complaint: లంచం అడిగిన అధికారులపై ఫిర్యాదు చేయాలా? ఈ నెంబర్‌కు ఒక్క ఫోన్‌ కాల్ కొట్టండి..
Corruption Complaint
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 14, 2023 | 5:05 PM

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 14: అవినీతి సూచీ 2022 (Corruption Index 2022)లో ఈ ఏడాది నవంబర్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. అవినీతి సూచిలో 40 పాయింట్లతో భారత్‌ 85 పాయింట్లతో 24వ స్థానంలో ఉంది. దీన్ని బట్టి మన దేశంలో అవినీతికి పాల్పడుతున్న అధికారుల సంఖ్య తక్కువేమీ కాదని స్పష్టమవుతోంది. ఇంటర్నేషనల్‌ కరప్షన్‌ పర్‌సెప్షన్స్‌ ఇండిక్స్‌ (CPI) ప్రకారం.. 12 పాయింట్లతో సోమాలియా ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి దేశంగా నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో సిరియా, సౌత్‌ సూడాన్‌, వెనుజులా, యెమిన్‌, నార్త్‌ కొరియా, బురుండి, హైతీ, లిబియా, ఈక్వటోరియల్‌ గినియా టాప్‌ 10 అవినీతి దేశాలుగా వెల్లడించింది. అలాగే అత్యల్ప అవినీతి దేశాలుగా టాప్‌ 10లో.. డెన్మార్క్‌, ఫిన్‌లాండ్‌, న్యూజిలాండ్‌, నార్వె, స్వీడన్‌, సింగపూర్‌, స్విడ్జర్లాండ్‌, నెదర్‌ల్యాండ్‌, జర్మనీ, ఐర్లాండ్‌ దేశాలు ఉన్నాయి. ఏదైనా పని నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే లంచావతారం ఎత్తే అధికారులపై ఫిర్యాదు ఏవిధంగా చేయాలో, ఎవరిక చేయాలో చాలా మందికి తెలియదు. ఆ వివరాలు మీకోసం..

ముందుగా లంచం అంటే ఏమిటో అర్థం చేసుకోండి?

అవినీతి నిరోధక చట్టం 1988 IPC సెక్షన్ 171 ప్రకారం లంచం తీసుకోవడం శిక్షార్హమైన నేరం. అయితే అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచం తీసుకోవడమే కాకుండా లంచం ఇవ్వడం కూడా నేరమే. సాధారణ భాషలో చెప్పాలంటే ఏదైనా అధికారిక పని కోసం ఒక అధికారి వద్దకు వెళ్తే.. ఆ పని చేసేందుకు అధికారి డబ్బు లేదా ఇతర ఏ రూపంలోనైనా డిమాండ్‌ చేస్తే లంచంగా పరిగణిస్తారు. అలాగే ఏదైనా పనిని పూర్తి చేయడానికి మీరు ఒక అధికారికి డబ్బు ఇస్తే అది కూడా నేరంగా పరిగణించబడుతుంది. నేరం రుజువైతే అటువంటి అధికారితోపాటు లంచం ఇచ్చిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ఎవరైనా లంచం అడిగితే ఎక్కడ ఫిర్యాదు చేయాలి?

లంచం లేదా అవినీతిపై ఫిర్యాదు చేయడానికి ప్రతి రాష్ట్రంలో వేర్వేరు ఏజెన్సీలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ అవినీతి నిరోధక బ్యూరో ఉంటుంది. అక్కడ లంచం అడిగిన వారిపై ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. యూపీ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా కూడా అవినీతి లేదా లంచం గురించి ఫిర్యాదు చేయవచ్చు. ఒక వేళ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు పంపాలనుకుంటే లేఖ, ఫోన్‌ కాల్, ఫ్యాక్స్ ద్వారా పంపవచ్చు.

ఇవి కూడా చదవండి
  • సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ పూర్తి చిరునామా ఇదే.. విజిలెన్స్ భవన్, A-బ్లాక్ GPO కాంప్లెక్స్, INA న్యూఢిల్లీ – 110 023.
  • అలాగే ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలనుకుంటే 011- 24600200కు ఫోన్‌ చేయవచ్చు.
  • ఫిర్యాదును ఫ్యాక్స్ రూపంలో పంపాలనుకుంటే 011- 24651010 లేదా 24651186కు పంపవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.