Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Criminal Justice System: ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ 2023ల మధ్య తేడా ఏమిటో తెలుసా?

మన దేశంలో ఏ రకమైన నేరానికైనా ఇండియన్ పీనల్ కోడ్ (IPC) ప్రకారం న్యాయస్థానాలు శిక్షలు వేస్తుంటాయి. గతంలో జమ్మూ కాశ్మీర్‌లో ఇండియన్ పీనల్ కోడ్ వర్తించేది కాదు. కానీ సెక్షన్ 370 రద్దు చేసిన తర్వాత, జమ్మూకాశ్మీర్‌లో కూడా ఇండియన్ పీనల్ కోడ్ అమలులోకి వచ్చింది. అయితే దాదాపు 186 ఏళ్ల తర్వాత తాజాగా న్యాయ విచారణ చట్టాల ప్రక్షాలనకు కేంద్రం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. భారత శిక్షా స్మృతి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌–ఐపీసీ 1860..

Criminal Justice System: ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ 2023ల మధ్య తేడా ఏమిటో తెలుసా?
Criminal Justice System
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 13, 2023 | 3:13 PM

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12: మన దేశంలో ఏ రకమైన నేరానికైనా ఇండియన్ పీనల్ కోడ్ (IPC) ప్రకారం న్యాయస్థానాలు శిక్షలు వేస్తుంటాయి. గతంలో జమ్మూ కాశ్మీర్‌లో ఇండియన్ పీనల్ కోడ్ వర్తించేది కాదు. కానీ సెక్షన్ 370 రద్దు చేసిన తర్వాత, జమ్మూకాశ్మీర్‌లో కూడా ఇండియన్ పీనల్ కోడ్ అమలులోకి వచ్చింది. అయితే దాదాపు 186 ఏళ్ల తర్వాత తాజాగా న్యాయ విచారణ చట్టాల ప్రక్షాలనకు కేంద్రం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. భారత శిక్షా స్మృతి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌–ఐపీసీ 1860, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌–సీఆర్పీసీ1898, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌1872ల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రక్రియ పార్లమెంటులో ప్రారంభమైంది. ఈ మూడు చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత బిల్లు (బీఎన్‌ఎసెస్‌), భారతీయ సాక్ష్య బిల్లు (బీఎస్‌)లను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ 2023, IPC, CRPకి మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం..

ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ 2023 అంటే ఏమిటి?

ఆగస్టు 11, 2023వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారతీయ న్యాయ సంహిత బిల్లు 2023ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. భారతదేశంలో నేర న్యాయ వ్యవస్థను సంస్కరించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మూడు కొత్త బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం పార్లమెంటరీ కమిటీ దానిని సమీక్షిస్తోంది. ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో ఇండియన్ జస్టిస్ కోడ్ 2023, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 1898 స్థానంలో ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ 2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో భారతీయ సాక్ష్య యాక్ట్ 2023 తీసుకురానున్నారు. ఈ క్రమంలో ఇండియన్ జస్టిస్ కోడ్ 2023 చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ 2023 ఇప్పటికే ఉన్న ఇండియన్ పీనల్ కోడ్‌లో మార్పులను తీసుకువస్తుంది.

 IPC, CRPC మధ్య తేడా ఏమిటి?

IPC అంటే ఇండియన్ పీనల్ కోడ్. ఇది బ్రిటీష్‌ కాలం నాటి వ్యవస్థ. నాటి నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఐపీసీని 1860లో ఏర్పాటు చేయగా 1862లో అమలులోకి వచ్చింది. అయితే ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ 2023 (BNS 2023) నేరాలకు ప్రత్యేకించి అత్యాచారం, శారీరక వేధింపుల వంటి నేరాలకు ప్రత్యేక చట్టాలను నిర్దేశిస్తుంది. ఐపీసీ స్థానంలో బీఎన్‌ఎస్‌ను తీసుకురానున్నారు. CRPC గురించి చెప్పాలంటే.. క్రిమినల్ కేసులు మొదట IPC కింద దాఖలు చేయబడతాయి. అవి కోర్టుకు చేరుకున్నప్పుడు CRPC (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) కింద కొనసాగుతాయి. ఈ బిల్లు 1973లో ఆమోదం పొందగా.. 1974లో అమలులోకి వచ్చింది. బ్రిటిష్‌ వారి పాలనాకాలంలో రూపొందించి, అమల్లోకి తెచ్చిన పాత మూడు చట్టాలకూ తర్వాత, స్వతంత్ర భారతంలో అవసరమైన సవరణలు చేశారు. 1959 నుంచి ఐపీసీని 12 పర్యాయాలు సవరించారు. ప్రస్తుతం ఐపీసీలో 555 సెక్షన్లు ఉన్నాయి

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.