AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad CP: హైదరాబాద్‌ కొత్త సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి నియామకం

తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్‌ కొత్త ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్‌ 12) హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్‌లకు కొత్త కమిషనర్‌లను నియమించింది. యాంటీ నార్కోటిక్ బ్యూరో హెడ్‌తో పాటు మూడు కమిషనరేట్‌లకు కొత్త కమిసనర్ లను నియమించింది. హైదరాబాద్‌ కొత్త పోలీస్‌ కమిషనర్‌ (సీపీ)గా కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి నియమితులయ్యారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా జి సుధీర్‌బాబు నియమితులయ్యారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా..

Hyderabad CP: హైదరాబాద్‌ కొత్త సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి నియామకం
New Police Commissioners
Srilakshmi C
|

Updated on: Dec 12, 2023 | 2:53 PM

Share

హైదరాబాద్‌, డిసెంబర్ 12: తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్‌ కొత్త ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్‌ 12) హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్‌లకు కొత్త కమిషనర్‌లను నియమించింది. యాంటీ నార్కోటిక్ బ్యూరో హెడ్‌తో పాటు మూడు కమిషనరేట్‌లకు కొత్త కమిసనర్ లను నియమించింది. హైదరాబాద్‌ కొత్త పోలీస్‌ కమిషనర్‌ (సీపీ)గా కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి నియమితులయ్యారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా జి సుధీర్‌బాబు నియమితులయ్యారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా అవినాష్ మొహంతి, తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య నియమితులయ్యారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐపీఎస్ బదిలీలకు తొలిసారి శ్రీకారం చుట్టుంది. కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐదుగురు ఐపీఎస్ అధికారులను మంగళవారం బదిలీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌లుగా ఉన్న దేవేంద్రసింగ్‌ చౌహాన్‌, ఎం స్టీఫెన్‌ రవీంద్రలు బదిలీ కావడంతో.. వారు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌కు రిపోర్టు చేయాల్సిందిగా సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం (ఈసీ) సీవీ ఆనంద్‌పై బదిలీ వేటు వేసిన తర్వాత హైదరాబాద్‌ సీపీగా సందీప్ శాండిల్యా నియమితులయిన విషయం తెలిసిందే. సీవీ ఆనంద్‌పై బదిలీ వేటు వేసిన తర్వాత హైదరాబాద్‌ సీపీ రేసులో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపించాయి. సందీప్‌ శాండిల్య, సంజయ్‌కుమార్‌ జైన్‌, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పేర్లు వినిపించాయి. వీరిలో శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తారని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సీపీగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోనే అత్యధిక సార్లు బదిలీ అయిన ఐపీఎస్‌ అధికారుల్లో కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఒకరు. అవినాష్‌ మొహంతికి సిన్సియర్‌ ఐపీఎస్‌ అధికారిగా పేరుంది. మరోవైపు ఓట్ల కౌంటింగ్ రోజు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో సస్పెండ్ అయిన తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌పై మంగళవారం ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.