AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS: ఆడవాళ్లు మీకు జోహార్లు.. ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసా.?

తెలంగాణ ప్రభుత్వం మహా లక్ష్మి పేరుతో తీసుకొచ్చిన ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వరంగల్‌ జిల్లాలో మహిళలు బస్సు ప్రయాణంలో సరికొత్త రికార్డును సృష్టించారు. ఆర్టీసీ బస్సు ప్రయాణంలో సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. మునుపేన్నడు లేనివిధంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో...

TS: ఆడవాళ్లు మీకు జోహార్లు.. ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసా.?
TS RTC
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Dec 12, 2023 | 3:22 PM

Share

తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. వీటిలో ఒకటి ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచడం అయితే.. మరొకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం.

తెలంగాణ ప్రభుత్వం మహా లక్ష్మి పేరుతో తీసుకొచ్చిన ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వరంగల్‌ జిల్లాలో మహిళలు బస్సు ప్రయాణంలో సరికొత్త రికార్డును సృష్టించారు. ఆర్టీసీ బస్సు ప్రయాణంలో సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. మునుపేన్నడు లేనివిధంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రికార్డు స్థాయిలో ప్రయాణం చేస్తున్నారు.

వరంగల్ రీజియన్ పరిధిలో ప్రతిరోజు సగటున రెండు లక్షల పైగా మహిళలు జీరో టికెట్ ద్వారా ప్రయాణం చేస్తున్నట్లుగా ఆర్టీసీ సంస్థ గుర్తించింది. తొమ్మిది డిపోల పరిధిలో రోజుకు రెండు లక్షల మందికి పైగా మహిళలు ఎర్ర బస్సు ఎక్కుతున్నారు. డిసెంబర్ 9వ తేదీన మహాలక్ష్మి పథకం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు RTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నారు. 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్దరాత్రి వరకు 94,128 మంది మహిళలు జీరో టికెట్ పై ప్రయాణం చేశారు. 10వ తేదీ ఆదివారం రోజు 2,26,645 మంది మహిళలు ప్రయాణం చేశారు. 11వ తేదీ రెండు లక్షలకు పైగా ప్రయాణం చేశారు..

పుణ్య క్షేత్రాలు చుట్టేస్తున్నారు..

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. కేవలం ఒక్క ఆదివారం, సోమ వారాల్లో రెండు లక్షలకు పైగా మహిళలు బస్సు ప్రయాణం చేయడం చర్చగా మారింది.. బస్సు ఆకూపెన్సిలో 70 శాతం మహిళలే ప్రయాణం చేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువగా హైదరాబాద్‌తో పాటు వేములవాడ, కాలేశ్వరం వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే రూట్లలో ప్రయాణం చేసినట్లుగా ఆర్టీసీ అధికారులు గుర్తించారు. మొత్తం మీద అతివలు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణ సర్కార్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.. ఫ్రీ బస్ జర్నీ పుణ్యాన పుణ్య క్షేత్రాలన్నీ చుట్టేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?