AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘వీడి దుంపదెగ..!’ కుంభీపాకం ఎప్పుడైనా చూశారా? ధైర్యం ఉంటే ఇప్పుడు చూడండి

ఈ మధ్యకాలంలో రకరకాల వంటకాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. పుర్రెకో బుద్ధి అన్నట్లు.. జిహ్వకో రుచి. రోజూ ఇలాగే తింటే ఏం బాగుంటుంది అనుకుంటారేమో.. వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ వింత వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. మ్యాగీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? పైగా గంటల కొద్దీ సమయం తీసుకోకుండా కేవలం 10 నిమిషాల్లో చకచకా తయారు..

Viral Video: 'వీడి దుంపదెగ..!' కుంభీపాకం ఎప్పుడైనా చూశారా? ధైర్యం ఉంటే ఇప్పుడు చూడండి
Viral Video
Srilakshmi C
|

Updated on: Dec 11, 2023 | 5:00 PM

Share

ఈ మధ్యకాలంలో రకరకాల వంటకాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. పుర్రెకో బుద్ధి అన్నట్లు.. జిహ్వకో రుచి. రోజూ ఇలాగే తింటే ఏం బాగుంటుంది అనుకుంటారేమో.. వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ వింత వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. మ్యాగీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? పైగా గంటల కొద్దీ సమయం తీసుకోకుండా కేవలం 10 నిమిషాల్లో చకచకా తయారు చేసుకోవచ్చు. అయితే వీడెవడో గానీ మ్యాగీని చిర్రెత్తుకొచ్చేలా తయారు చేస్తున్నాడు. పైగా దాన్ని వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఛీ.. యాక్‌! ఇదేం మ్యాగీ అంటూ తిట్టిపోస్తున్నారు. మీరూ చూసేయండి..

ఈ వీడియోలో ముందుగా స్టౌపై ఓ పాన్‌ పెట్టి అందులో నూనెకు బదులు కొద్దిగా నీళ్లు పోయడం కనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని ఉల్లి, పచ్చిమిర్చి తురుము వేస్తారు. ఇంత వరకూ బాగానేఉన్నా ఆ తర్వాతే అసలు టార్చర్‌ మొదలవుతుంది. చాక్లెట్‌ కేక్‌ ఒక ముక్క తీసుకొచ్చి అందులో వేయడం వీడియోలో కనిపిస్తుంది. అనంతరం నీళ్ల తాళింపులో కేకును మెత్తగా స్మాష్‌ చేయడం కనిపిస్తుంది. అందులో మరో గ్లాసుడు నీళ్లు పోసి, మ్యాగి వేస్తారు. ఆ తర్వాత మ్యాగీ మసాలా వేసి గరిటెతో చిక్కబడేంత వరకూ తిప్పడం వీడియోలో చూడొచ్చు. ముదురు గోధుమ రంగులో తయారు చేసిన ఈ చాక్లెట్‌ కేక్‌ మ్యాగీ నూడిల్స్‌ను ఓ పేపర్‌ ప్లేట్‌లో సర్వ్‌ చేసి, పైన చాక్లెట్‌ కేక్‌తో గార్నిష్‌ చేయడం కనిపిస్తుంది. ఈ వీడియోలు పోస్టు చేసిన గంటల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్‌, వేలల్లో లైకులు కామెంట్లు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వంటలు కొత్తగా తయారు చేయడం చూశాం గానీ.. మరీ ఇంత వింతగా చేయడం ఇదే మొదటిసారి చూస్తున్నాం అని ఒకరు, చూడ్డానికే ఎంత టార్చర్‌గా ఉంది భయ్యా! నీ వంటకానికో నమస్కారం అని మరొకరు, పాక శాస్త్రానికి ఏంతటి విపత్కర పరిస్థితి వచ్చింది.. ఎంత దుర్మార్గం అంటూ ఇంకొకరు కామెంట్ సెక్షన్‌లో భిన్నంగా స్పందించారు. ఈ స్పెషల్‌ నూడిల్స్‌ ట్రై చేసే ధైర్యం మీకూ ఉందా?

మరిన్ని ఆసక్తికర కథనాల కోసం క్లిక్‌ చేయండి.

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో