రోడ్డుమీద హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా దూసుకొచ్చిన పులి !!
వన్యప్రాణులు ఆహారం కోసమో, నీటి కోసమో జనావాసాల్లోకి వస్తుంటాయి. సాధారణంగా అడవి జంతువులంటే అందరికీ భయమే. పులి, సింహం, చిరుత, ఎలుగుబంటిలాంటివాటిని దూరంనుంచి చూస్తేనే భయం కలుగుతుంది. అలాంటిది ఊహించని విధంగా మీ సమీపంలోకి వస్తే.. భయంతో వెనక్కి తిరిగి చూడకుండా పరుగులంకించుకుంటారు కదా.. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.
వన్యప్రాణులు ఆహారం కోసమో, నీటి కోసమో జనావాసాల్లోకి వస్తుంటాయి. సాధారణంగా అడవి జంతువులంటే అందరికీ భయమే. పులి, సింహం, చిరుత, ఎలుగుబంటిలాంటివాటిని దూరంనుంచి చూస్తేనే భయం కలుగుతుంది. అలాంటిది ఊహించని విధంగా మీ సమీపంలోకి వస్తే.. భయంతో వెనక్కి తిరిగి చూడకుండా పరుగులంకించుకుంటారు కదా.. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డుపైన తన మానాన తను హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఒక పెద్దపులి అతని ముందునుంచి వేగంగా పరుగెతుడూ రోడ్డు దాటి వెళ్లింది. అతను ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే పులి అతన్ని ఢీకొట్టేదే.. ఊహించని ఈ ఘటనతో ఆ వ్యక్తి ఒక్కసారిగా జడుసుకున్నాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెనక్కి పరుగుతీశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ… ఇతను అందరికన్నా అదృష్టవంతుడై ఉంటాడు..? టైగర్ అతనిని చూసి అస్సలు స్పందించలేదు.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను డిసెంబర్ 8న షేర్ చేయగా ఇప్పటికే దాదాపు 5 లక్షలమందికి వీక్షించారు. 5 వేలమందికి పైగా లైక్ చేశారు. దీనిపై స్పందించిన ఓ యూజర్ ఉత్తరాఖండ్ ప్రజలకు ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అంటూ రాసుకొచ్చారు. మరో యూజర్ టైగర్ ఉపవాస దీక్షలో ఉందంటూ సరదాగా స్పందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లలతో నడుస్తున్న మహిళ.. వారిపై కూలిన ఇంటి పైకప్పు
వరకట్న పిశాచానికి యువ డాక్టర్ బలి
గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఉధృతం.. దిక్కుతోచని స్థితిలో పౌరులు
AMకి PMకి తేడా తెలియని వారు పీఎంవోను ఎలా నడుపుతారు ??
TOP 9 ET News: అనిమల్ కి ఐకాన్ స్టార్ షాకింగ్ రివ్యూ | దేవ కాదు..సలార్ వస్తోంది.. దిమ్మతిరిగిపోవాలి