ఎస్సై చేసిన పొరపాటు.. మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్
ఓ పోలీసు అధికారి పొరపాటు మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం కుమారుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ ఊహంచని విధంగా ప్రమాదంలో పడింది. పోలీసు అధికారి తుపాకి శుభ్రం చేస్తుండగా పొరపాటున అది పేలి బుల్లెట్ నేరుగా అక్కడ నిల్చుని ఉన్న మహిళ తలలోకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా మహిళ కుప్పకూలిపోయింది. ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ పోలీసు అధికారి పొరపాటు మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం కుమారుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ ఊహంచని విధంగా ప్రమాదంలో పడింది. పోలీసు అధికారి తుపాకి శుభ్రం చేస్తుండగా పొరపాటున అది పేలి బుల్లెట్ నేరుగా అక్కడ నిల్చుని ఉన్న మహిళ తలలోకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా మహిళ కుప్పకూలిపోయింది. ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అలీగఢ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం… ఇష్రత్ అనే మహిళ పాస్‌పోర్టు వెరిఫికేషన్ కోసం తన కుమారుడితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆ సమయంలో అక్కడి ఎస్సై తుపాకీ క్లీన్ చేస్తున్నారు. మహిళ, ఆమె కుమారుడు ఎస్సై టేబుల్ ముందు నిల్చుని ఉన్నారు. తుపాకీ శుభ్రం చేస్తున్న సమయంలో పొరపాటున పేలడంలో ప్రమాదం జరిగింది. వెంటనే మహిళను ఆస్పత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బుల్లెట్ మహిళ తల వెనుకభాగంలోకి చొచ్చుకొనిపోయిందని, ఆపరేషన్ చేయాల్సి ఉందని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డుమీద హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా దూసుకొచ్చిన పులి !!