ఈ ఆటో డ్రైవర్ చాలా స్పీడ్ గురూ !! రైలు కంటే వేగంగా వెళ్లి
రైలు ప్రయాణాలు చేసేవారు ఒక్కోసారి సమయానికి స్టేషన్‌కి చేరలేక తాము ఎక్కాల్సిన రైలు మిస్ అవుతూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి అలాగే రైలు మిస్ చేసుకున్నాడు. ఏం చేయాలో తోచక తప్పేదేముంది ఫ్లైట్కోసం పరుగెత్తాల్సిందే అనుకున్నాడు. అప్పుడే అతనికి ఓ ఆటో డ్రైవర్ తగిలాడు. అతనిని తాను ఎక్కాల్సిన రైలు పక్కస్టేషన్లో ఎక్కిస్తానని చెప్పాడు. ట్రైన్ ఎక్కిస్తేనే డబ్బలు ఇవ్వమని, లేదంటే తనకు డబ్బులు ఇవ్వనక్కర్లేదని చెప్పాడు.
రైలు ప్రయాణాలు చేసేవారు ఒక్కోసారి సమయానికి స్టేషన్‌కి చేరలేక తాము ఎక్కాల్సిన రైలు మిస్ అవుతూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి అలాగే రైలు మిస్ చేసుకున్నాడు. ఏం చేయాలో తోచక తప్పేదేముంది ఫ్లైట్కోసం పరుగెత్తాల్సిందే అనుకున్నాడు. అప్పుడే అతనికి ఓ ఆటో డ్రైవర్ తగిలాడు. అతనిని తాను ఎక్కాల్సిన రైలు పక్కస్టేషన్లో ఎక్కిస్తానని చెప్పాడు. ట్రైన్ ఎక్కిస్తేనే డబ్బలు ఇవ్వమని, లేదంటే తనకు డబ్బులు ఇవ్వనక్కర్లేదని చెప్పాడు. అందుకు 2,500 రూపాయలు అడిగాడు. కాస్త అనుమానంగా చూసినా.. ఆటో డ్రైవర్ ఛాలెంజ్‌కు సదరు వ్యక్తి సై అన్నాడు. అంతే అక్కడినుంచి 27 కిలో మీటర్ల దూరంలో ఉన్న స్టేషన్‌కి రైలుకంటే ముందే చేర్చడంతో ఆటోడ్రైవర్ స్మార్ట్ వర్క్‌కి ఫిదా అయిపోయాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. ఆదిల్ హుస్సేన్ అనే వ్యక్తి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేధికగా నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం తాను.. బెంగళూరు నగర్ రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం ఒంటిగంట 40 నిమిషాలకు పశుపతి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేందుకు ఆటోలో వెళ్లానని, అయితే ట్రాఫిక్ కారణంగా తాను వెళ్లేసరికి ట్రైన్ వెళ్లిపోయిందని తెలిపాడు. ఏం చేయాలో తోచక అయోమయంగా చూస్తున్న తనవద్దకు ఓ ఆటో డ్రైవర్ వచ్చి, తనను రైలు వెళ్లే తదుపరి స్టేషన్‌కు తీసుకువెళతానని చెప్పడంతో.. ఆ రైల్వే స్టేషన్ అక్కడికి దాదాపు 27 కిలో మీటర్ల దూరంలో ఉండటంతో తాను నమ్మలేదని చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎస్సై చేసిన పొరపాటు.. మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్
రోడ్డుమీద హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా దూసుకొచ్చిన పులి !!
గన్ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?
దంపతుల రీల్స్ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా
ఏనుగులకు స్పెషల్ డైట్..
మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు...వంటచెయ్యరు..ఎందుకో తెలుసా?
కొత్త కారు.. షోరూమ్నుంచి బయటకు తీస్తుండగా..

