వరకట్న పిశాచానికి యువ డాక్టర్‌ బలి

కాలం మారుతున్నా కట్నం వేధింపులు మాత్రం ఆగడంలేదు. విద్యావంతులు సైతం ఈ వరకట్న పిశాచానికి బలైపోతున్నారు. తాజాగా అధిక కట్నం డిమాండ్‌ చేయడంతో ఓ యువ డాక్టర్‌ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పీజీ చదువుతున్న సహానా కు ఇటీవలే తన స్నేహితుడు, మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధితో వివాహం నిశ్చయమైంది.

వరకట్న పిశాచానికి యువ డాక్టర్‌ బలి

|

Updated on: Dec 09, 2023 | 9:52 AM

కాలం మారుతున్నా కట్నం వేధింపులు మాత్రం ఆగడంలేదు. విద్యావంతులు సైతం ఈ వరకట్న పిశాచానికి బలైపోతున్నారు. తాజాగా అధిక కట్నం డిమాండ్‌ చేయడంతో ఓ యువ డాక్టర్‌ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పీజీ చదువుతున్న సహానా కు ఇటీవలే తన స్నేహితుడు, మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధితో వివాహం నిశ్చయమైంది. అయితే, అబ్బాయి కుటుంబం వారు భారీగా కట్నం డిమాండ్‌ చేశారు. కట్నంగా పెద్ద మొత్తంలో బంగారం, భూమి, బీఎమ్‌డబ్ల్యూ కారు డిమాండ్‌ చేశారు . అంత కట్నం తాము ఇచ్చుకోలేమని సహానా కుటుంబం చెప్పింది. దాంతో మగపెళ్లి వారు సంబంధాన్ని క్యాన్సిల్‌ చేసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన సహానా ఇన్‌స్టిట్యూట్‌ సమీపంలోని అద్దె అపార్ట్‌మెంట్‌లో బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు ఉధృతం.. దిక్కుతోచని స్థితిలో పౌరులు

AMకి PMకి తేడా తెలియని వారు పీఎంవోను ఎలా నడుపుతారు ??

TOP 9 ET News: అనిమల్ కి ఐకాన్ స్టార్ షాకింగ్ రివ్యూ | దేవ కాదు..సలార్ వస్తోంది.. దిమ్మతిరిగిపోవాలి

Amardeep: అమర్ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు.. కీర్తి ఆవేదన

Mangalavaram: OTTలోకి మంగళవారం డేట్‌ ఫిక్స్.. ఎప్పుడంటే ??

 

Follow us