CM Revanth Reddy: రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
ఆదివారం యశోదా ఆస్పత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించడానికి సీఎం రేవంత్ వచ్చినప్పుడు జరిగిన ఘటన ఇది. రేవంత్ అన్నా.. మీతో మాట్లాడాలన్నా.. అంటూ వెనకనుంచి ఒక మహిళ అభ్యర్థించడాన్ని గమనించిన సీఎం.. వెంటనే ఆగి.. వెనక్కి తిరిగి ఆమె దగ్గరికెళ్లి.. సమస్యేంటి అని అడిగి తెలుసుకున్నారు.

తన పాపను ఆస్పత్రిలో చేర్చామని, చికిత్సకు చాలా ఎక్కువ ఖర్చు అవుతోందని, సాయం చేయాలని కోరారామె. వెంటనే ఆమెకు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించి వెళ్లారు సీఎం రేవంత్. ఎంత హడావుడిలో ఉన్నా బాధితుల గోడును ఓపిగ్గా ఆలకించే సీఎం.. అంటూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.