Google Maps: ఇదేందయ్యా ఇది! గూగుల్ మ్యాప్స్‌ను నమ్మాడు.. ఏకంగా వ్యాన్‌తో నట్టేట మునిగాడు.. చివరికి.!

గూగుల్ రోడ్ మ్యాప్ ఓ వ్యాన్ ని ప్రాజెక్టు నీళ్లలోకి తీసుకెళ్లింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ దగ్గర గూగుల్ మ్యాప్ తప్పుదారి పట్టించి ప్రమాదంలో నెట్టివేసింది. గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టులో ఓ వ్యాన్ చిక్కుకోవడానికి కారణమైంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాల ప్యాకెట్ కవర్ లోడ్ తో హుస్నాబాద్ నుండి హైదరాబాద్‎కు వెళుతు డ్రైవర్ కు దారిపై సరైన అవగాహన లేకపోవడంతో స్మార్ట్ ఫోన్‎లో గూగుల్ రూట్ మ్యాప్ ఆధారంగా వ్యాన్‎ని నడిపారు.

Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 11, 2023 | 11:43 AM

గూగుల్ రోడ్ మ్యాప్ ఓ వ్యాన్ ని ప్రాజెక్టు నీళ్లలోకి తీసుకెళ్లింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ దగ్గర గూగుల్ మ్యాప్ తప్పుదారి పట్టించి ప్రమాదంలో నెట్టివేసింది. గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టులో ఓ వ్యాన్ చిక్కుకోవడానికి కారణమైంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాల ప్యాకెట్ కవర్ లోడ్ తో హుస్నాబాద్ నుండి హైదరాబాద్‎కు వెళుతు డ్రైవర్ కు దారిపై సరైన అవగాహన లేకపోవడంతో స్మార్ట్ ఫోన్‎లో గూగుల్ రూట్ మ్యాప్ ఆధారంగా వ్యాన్‎ని నడిపారు. నందారం స్టేజి దాటిన తర్వాత సూటిగా రోడ్డు ఉందని గూగుల్ చూపగా, చీకట్లో వ్యాన్‎ని నడుపుతూ అలాగే వెళ్లారు. వానల వల్ల నిలిచిన నీరు అనుకుని ముందుకు వెళ్లగానే లోతు పెరిగింది.

వ్యాన్ క్యాబిన్ వరకు నీళ్లు చేరి వాహనం పనిచేయడం ఆగిందని గ్రహించిన డ్రైవర్‎తో సహా ముగ్గురు వ్యాన్ దిగి మెల్లగా సమీపంలోని జలు బాయ్ తండాకు వెళ్ళారు. విషయం గ్రామస్తులకు తెలుపగా.. వ్యాన్ ప్రాజెక్టు నీటిలో మునిగిందని గ్రహించిన గ్రామస్తులు వ్యాన్‎కి తాళ్లు కట్టి జెసిబి సహాయంతో వెనుక్కులాగడంతో అతి కష్టం మీద బయటకు వచ్చింది. అయితే గత నాలుగు నెలల క్రితం ఓ లారీ కూడా గూగుల్ రూట్ మ్యాప్ తప్పుదారి పట్టియడంతో ఇదే రీతిగా ప్రాజెక్ట్ నీటిలోకి దూసుకెళ్లింది. అప్పుడు కూడా డ్రైవర్ అప్రమత్తమవడంతో ప్రాణాపాయం తప్పింది. అప్పుడు కూడా ఇదే గ్రామస్తులు జెసిబి సహాయంతో లారీని బయటికి తీశారు. వాస్తవానికి నందారం స్టేజ్ వద్ద రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేసి వాహనాలను అక్కడి నుండి బైపాస్ రోడ్డు ద్వారా దారి మళ్ళించారు. అయితే స్టాపర్లు రోడ్డు పక్కన పడిపోయాయి, ఎవరు పట్టించుకోలేదు. దీంతో వ్యాన్ ఆ దారిలో వెళ్లి ప్రాజెక్టు నీటిలోకి దూసుకుపోయింది. ఇప్పటికైనా నందారం నుంచి ప్రాజెక్టు వైపుకు ఉన్న దారిని పూర్తిగా మూసివేయాలని గ్రామస్తులు, స్థానికులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!