AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. సీఎం క్యాంప్ ఆఫీస్‎గా MCRHRDI భవనం..?

మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన అనంతరం యశోదా ఆసుపత్రి నుంచి నేరుగా జూబ్లీ హిల్స్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీకి చేరుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అక్కడే అధికారుల్ని కూర్చోబెట్టుకుని సుదీర్ఘంగా చర్చించారు. ఏం మాట్లాడారు? కొత్త క్యాంప్ ఆఫీస్ అన్వేషణలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి... అందులో భాగంగానే ఈ విజిట్ చేశారా? కొత్త సీఎం కొత్త క్యాంపాఫీసు కేరాఫ్ ఇదేనా? మరి.. ప్రగతి భవన్‌ భవిష్యత్ ఏంటి..? అంటూ చర్చోపచర్చలు మొదలయ్యాయి.

Revanth Reddy: రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. సీఎం క్యాంప్ ఆఫీస్‎గా MCRHRDI భవనం..?
Cm Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Dec 10, 2023 | 9:31 PM

Share

తెలుగురాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పటినుంచి ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకించి క్యాంప్ ఆఫీస్ ఉండాలనే సంప్రదాయం గతంలో లేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఎన్నికయ్యాక.. బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్ రోడ్‌లో పదిమంది ఐఏఏస్ అధికారులు, 24 ఇతర అధికారుల క్వార్టర్స్‌ను తొలగించి.. తన కోసం క్యాంపాఫీసు నిర్మించుకున్నారు. మరణించేవరకు వైఎస్, ఆ తర్వాత వైఎస్ కుటుంబం కొన్నాళ్లు అందులోనే ఉండేవారు. కానీ.. కొత్త రాష్ట్రం పుట్టి.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. కేసీఆర్ 38 కోట్ల ఖర్చుతో ఈ క్యాంపాపీసును రూపురేఖల్ని మార్చేసి.. ప్రగతి భవన్‌గా నామకరణం చేసి.. 2016 నవంబర్‌ లో ఎంట్రీ ఇచ్చారు. సచివాలయంలో తనకున్న ఛాంబర్‌తో పాటు క్యాంప్ ఆఫీసుగా ప్రగతిభవన్ వేదికగా.. అధికపక్షం అధికారిక కార్యకలాపాలు నిర్వహించేవారు కేసీఆర్. అవసరాన్ని బట్టి మంత్రుల్ని, అధికారుల్ని ఫామ్‌హౌస్‌కే పిలిపించుకునేవారు. కట్‌చేస్తే.. ఇప్పుడు తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి శకం మొదలైంది. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టే ప్రగతి భవన్‌ను జ్యోతిరావ్ పూలే ప్రజాభవన్‌గా మార్చి.. అక్కడే ప్రజాదర్బార్ షురూ చేశారు.

ప్రజాభవన్‌ని ఎలా ఉపయోగించుకోవాలన్న అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వేరే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి… తాజా సీఎం రేవంత్‌రెడ్డి తాజా క్యాంప్ ఆఫీసు ఎక్కడ? ఎక్కడినుంచి అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తారు అనేది నిన్నటిదాకా కొనసాగిన సస్పెన్స్. కొత్త ఖర్చుతో కొత్త భవనం ఎందుకు.. కొత్తగా కట్టిన సచివాలయం ఉండనే ఉందిగా… అక్కడి నుంచే యాక్షన్‌ పార్ట్ మొదలుపెడతారు అనే చర్చ కూడా సాగింది. కానీ.. రేవంత్ మనసు మాత్రం మరోలా ఆలోచిస్తోంది. జూబ్లిహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో తన క్యాంపాఫీసు నిర్మించుకోనున్నట్టు గతంనుంచి చెబుతూ వస్తున్నారు రేవంత్‌రెడ్డి.

ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీఐకి చేరుకుని, మంత్రులతో కలిసి పరిశీలించారు. ఎలక్ట్రిక్ కార్లో ఎంసిఆర్ హెచ్ఆర్‌డీ పరిసరాల్లో పర్యటించారు. ఇదే అధికారిక భవనం అని సీఎం డైరెక్ట్‌గా చెప్పలేదు. కానీ.. దీన్ని క్యాంపాఫీసుగా తీర్చిదిద్దడం కోసం ఏమేం మార్పులు-చేర్పులు చేయాలో అధికారులతో చర్చించారు. ఇక్కడ ఇప్పటికే ఉన్న హెలిపాడ్‌ను మెరుగు పరచాలని కూడా ఆదేశించారు. రేపటినుంచే పునరుద్ధరణ పనులు మొదలయ్యే ఛాన్సుంది. అటు.. తన ఇంటికి దగ్గరగా ఉండడం వల్ల కూడా దీన్నే క్యాంపు కార్యాలయంగా ఫిక్సయ్యారు రేవంత్‌రెడ్డి. సో.. సీఎం క్యాంప్ ఆఫీసు కేరాఫ్.. MCRHRDI. ఇది మాత్రం పక్కా..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..