AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NRSC Hyderabad Jobs: హైదరాబాద్‌లోని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో టెక్నీషియన్ ఉద్యోగాలు..పదో తరగతి అర్హత

హైదరాబాద్‌లోని ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్.. పలు విభాగాల్లో 54 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్‌ 31, 2023 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి..

NRSC Hyderabad Jobs: హైదరాబాద్‌లోని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో టెక్నీషియన్ ఉద్యోగాలు..పదో తరగతి అర్హత
NRSC Hyderabad
Srilakshmi C
|

Updated on: Dec 10, 2023 | 9:57 PM

Share

హైదరాబాద్‌లోని ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్.. పలు విభాగాల్లో 54 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్‌ 31, 2023 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్ధులు.. ఎన్‌ఆర్‌ఎస్సీ- ఎర్త్ స్టేషన్ (షాద్‌నగర్/ బాలానగర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-సెంట్రల్ (నాగ్‌పుర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నార్త్ (న్యూదిల్లీ), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-ఈస్ట్ (కోల్‌కతా), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-వెస్ట్ (జోధ్‌పుర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్- సౌత్ (బెంగళూరు) వీటిల్లో ఏదైనా ఓ చోట పనిచేయవల్సి ఉంటుంది.

ఆసక్తి, అర్హత కలితిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్‌ 09, 2023వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 31, 2023వ వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. అప్లికేషన్‌ నింపే సమయంలో దరఖాస్తు రుసుము కింద రూ.600లు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

పోస్టుల వివరాలు..

  • టెక్నీషియన్-బి (ఎలక్ట్రానిక్ మెకానిక్) పోస్టులు: 33
  • టెక్నీషియన్-బి (ఎలక్ట్రికల్) పోస్టులు: 8
  • టెక్నీషియన్-బి (ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్) పోస్టులు: 9
  • టెక్నీషియన్-బి (ఫొటోగ్రఫీ) పోస్టులు: 2
  • టెక్నీషియన్-బి (డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్) పోస్టులు: 2

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల

వైమానిక కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికిగానూ ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా విమానయాన రంగంలో లైసెన్స్‌/ ఇంజినీరింగ్‌/ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 12వ తరగతి ఉత్తీర్ణత లేదా ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా మార్చి 31, 2024 నిర్ణయించారు. వచ్చే ఏడాది మే మొదటి వారంలో ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 జరుగుతుంది. అడ్మిషన్ కౌన్సెలింగ్ 2024 మే మూడో వారంలో జరుగుతుంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..