Karni Sena Chief Murder Case: సుఖ్‌దేవ్‌ సింగ్‌ హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్..!

రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన చీఫ్‌ సుఖ్‌దేవ్‌ సింగ్‌ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు ప్రదాన నిందితులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, రాజస్థాన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నిందితులను చండీగఢ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం (డిసెంబర్‌ 10) మీడియకు తెలిపారు. స్పెషల్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీంద్ర యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Karni Sena Chief Murder Case: సుఖ్‌దేవ్‌ సింగ్‌ హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్..!
Karni Sena Chief Murder Case
Follow us

|

Updated on: Dec 10, 2023 | 4:32 PM

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 10: రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన చీఫ్‌ సుఖ్‌దేవ్‌ సింగ్‌ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు ప్రదాన నిందితులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, రాజస్థాన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నిందితులను చండీగఢ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం (డిసెంబర్‌ 10) మీడియకు తెలిపారు. స్పెషల్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీంద్ర యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం..

కేసు నమోదైనప్పటి నుంచి నిందితులను ట్రాక్‌ చేశామని, తాజాగా చండీగఢ్‌లో వాళ్లు పట్టుబడ్డారని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఆదివారం అరెస్టైన వారిలో ప్రధాన నిందితులు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీ ఉన్నారు. ఈ హత్యోదంతంలో మరో వ్యక్తి కూడా వీరికి సహకరించాడు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం వారిని ఢిల్లీలోని క్రైం బ్రాంచ్‌ కార్యాలయానికి తరలించారు. సుఖ్‌దేవ్ సింగ్ హత్యకు సంబంధించి హర్యానాలోని మహేంద్రగఢ్‌కు చెందిన రామ్‌వీర్ సింగ్‌ను డిసెంబర్ 9 (శనివారం)న జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు.

కాగా డిసెంబర్ 5వ తేదీన ఇద్దరు షూటర్లు నితిన్ ఫౌజీ, రోహిత్ రాథోడ్‌, నవీన్ షెకావత్ అనే ముగ్గురు దుండగులు బైక్‌ మీద వచ్చి.. శ్యామ్ నగర్‌లోని సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని అతని నివాసంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపి హత్య చేసిన సంగతి తెలిసిందే. నిందితులు సుఖ్‌దేవ్ సింగ్‌తో మాట్లాడుతున్నట్లు నటించి ఒక్కసారిగా తుపాకులతో కాల్పులు జరిపారు. సుఖ్‌దేవ్‌ సింగ్‌ హత్య అనంతరం పోలీసులపై నితిన్ ఫౌజీ, అతని సహచరులు కాల్పులు జరిపి పరార్‌ అయ్యారు. పోలీసులు జరిగిన ఎదురు కాల్పుల్లో మూడో దుండగుడు నవీన్ షెకావత్.. సుఖ్‌దేవ్ నివాసంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఎదురుకాల్పుల్లో సుఖ్‌దేవ్‌ సెక్యూరిటీ గార్డు ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సుఖ్‌దేవ్ సింగ్‌ను కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

మరుసటి రోజు కర్ణి సేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు నిరసనగా రాజ్‌పుత్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే ఆ తర్వాత బంద్‌ను రద్దు చేశారు. బీజేపీ నేత బల్ముకుంద్ ఆచార్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించారు. ఈ సంఘటనకు అశోక్ గెహ్లాట్ కారణమని ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
భారత ఒలింపిక్స్ బృందానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు
భారత ఒలింపిక్స్ బృందానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు