AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhattisgarh New CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్.. మాజీ సీఎంను కాదని బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం..

చత్తీస్‌ఘడ్‌ సీఎంగా విష్ణుదేవ్‌ సాయ్‌ను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. రాయ్‌పూర్‌లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో విష్ణుదేవ్‌ను బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. విష్ణుదేవ్‌ సాయి గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 2020 వరకు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నెరవేర్చారు.

Chhattisgarh New CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్.. మాజీ సీఎంను కాదని బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం..
Vishnu Deo Sai
Shaik Madar Saheb
|

Updated on: Dec 10, 2023 | 4:05 PM

Share

చత్తీస్‌ఘడ్‌ సీఎంగా విష్ణుదేవ్‌ సాయ్‌ను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. రాయ్‌పూర్‌లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో విష్ణుదేవ్‌ను బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. విష్ణుదేవ్‌ సాయి గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 2020 వరకు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నెరవేర్చారు. మాజీ సీఎం రమణ్‌సింగ్‌ను కాదని ఆయన్ను ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన విష్ణుదేవ్‌ సాయ్‌ను బీజేపీ హైకమాండ్‌ సీఎంగా ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం పదవి కోసం మాజీ సీఎం రమణ్‌సింగ్‌, రేణుకాసింగ్‌, అరుణా సావ్‌, విష్ణుదేవ్‌ సాయ్‌, ఓపీ చౌదరి పోటీ పడ్డారు. చివరకు ఎమ్మెల్యేలు విష్ణుదేవ్‌ సాయ్‌ వైపు మొగ్గు చూపడంతో భారతీయ జనతాపార్టీ అధిష్టానం అతని పేరును ప్రకటించింది. ముగ్గురు కేంద్ర పరిశీలకుల పర్యవేక్షణలో కొత్త సీఎం ఎన్నిక జరిగింది.

డిసెంబర్ 3న వెలువడిన ఛత్తీస్‌గఢ్ ఫలితాల తరువాత సీఎం ఎవరన్న దానిపై చర్చ నడుస్తూ వస్తోంది. బిజెపి కేంద్ర నాయకత్వం నియమించిన పరిశీలకుడు కేంద్ర మంత్రి అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ సమక్షంలో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ కూడా హాజరయ్యారు. వీరితోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 54 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఛత్తీస్‌గఢ్‌లో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘటన విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ గెలుపొందడంలో ఆదివాసీల పాత్ర ఎంతో ఉంది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ను బీజేపీ ఓడించింది. అదే విధంగా బస్తర్‌లో 3 సీట్లు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. దీంతో పాటు మైదాన ప్రాంతాల్లో బీజేపీ గెలుపులో ఓబీసీ ఓటర్లు కీలక పాత్ర పోషించారు.

కాగా.. బీజేపీ మధ్యప్రదేశ్ సీఎం ఎవరనేది రేపు ప్రకటించనుంది. అదేవిధంగా రాజస్థాన్ బీజేపీ శాసనసభా పక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..