ఉడికించి & అమ్లెట్‌.. అసలు కోడిగుడ్డు ఎలా తినాలి..?

13 March 2026

TV9 Telugu

TV9 Telugu

పోషకాలు దండిగా ఉండే ఆహారాల్లో గుడ్లు మొదటి వరుసలో ఉంటాయి. వీటిని రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు

TV9 Telugu

శ‌రీరం స్వయంగా త‌యారు చేసుకోలేని తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు గుడ్డులో ఉంటాయి. వీటితో పాటు గుడ్డులో విట‌మిన్ బి12, విట‌మిన్ డి, సెలీనియం, కొలిన్ వంటి ముఖ్యమైన పోష‌కాలు కూడా ఉంటాయి

TV9 Telugu

బ‌రువును నియంత్రించ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, కంటి ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఇవి ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. గుడ్డు ప్రయోజనాలు వీటిని వండే విధానంపై ఆధారపడి ఉంటుందని పోష‌కాహార నిపుణులు అంటున్నారు

TV9 Telugu

గుడ్లను కొంద‌రు ప‌చ్చిగా తీసుకుంటే మరికొందరు ఉడికించి తీసుకుంటారు. ఇంకొందరు ఆమ్లెట్‌ వేసుకుని ఆరగిస్తారు. అయితే ఇలా తీసుకోవ‌డానికి బ‌దులుగా గుడ్లను వండి తీసుకోవ‌డం వ‌ల్ల వీటిలో ఉండే ప్రోటీన్ సుల‌భంగా జీర్ణమ‌వుతుంది

TV9 Telugu

అలాగే గుడ్డులో ఉండే బ‌యోటిన్ అనే విట‌మిన్ ను శ‌రీరం సుల‌భంగా ఉప‌యోగించుకోగ‌లుగుతుంది. గుడ్లను త‌క్కువ స‌మ‌యం త‌క్కువ ఉష్ణోగ్రత మీద ఉడికించి తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు అంటున్నారు

TV9 Telugu

అందుకే గుడ్లను ఉడ‌క‌బెట్టడం అత్యంత ఆరోగ్యక‌ర‌మైన ప‌ద్దతుల్లో ఒక‌టి. ఉడికించిన గుడ్లలో త‌క్కువ క్యాల‌రీలు, ఎక్కువ పోష‌కాలు అందుతాయి. అలాగే త‌క్కువ ఉష్ణోగ్రత‌లో వండ‌డం వ‌ల్ల పొష‌కాలు నశించవు

TV9 Telugu

తాజా గుడ్లల్లో ఆలివ్‌ ఆయిల్‌తో ఆమ్లెట్‌ చేసి తినవచ్చు. అయితే ఇందులో పాల‌కూర‌, ట‌మాటా, క్యాప్సికం వంటి ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే కూర‌గాయ‌లు క‌లిపి తీసుకోవ‌డం మంచిది

TV9 Telugu

గుడ్డులోని పోష‌కాలు ఎక్కువ‌గా ప‌చ్చసొన‌లోనే ఉంటాయి. క‌నుక దీనిని కూడా తీసుకోవ‌డం మంచిది. గుడ్డును ఎక్కువ వేడి వ‌ద్ద ఎక్కువ స‌మ‌యం ఉడికించ‌డం వ‌ల్ల విట‌మిన్ డి సుమారు 61 శాతం త‌గ్గుతుంది. క‌నుక గుడ్లను ఎల్లప్పుడు త‌క్కువ ఉష్ణోగ్రత వ‌ద్ద మాత్రమే ఉడికించ‌డం మంచిది