మీరూ ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారా..? గుర్తించే సంకేతాలు ఇవే

13 March 2026

TV9 Telugu

TV9 Telugu

ఉప్పు లేని కూర చప్పన.. అన్నట్లు కొన్ని వంటకాలకు ఉప్పు తగలాల్సిందే. కానీ ఉప్పు మితిమీరితే మాత్రం ఆరోగ్యానికి ముప్పు తప్పదంటున్నారు వైద్య నిపుణులు

TV9 Telugu

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటుతో పాటు గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వస్తాయి. మరి మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటున్నారని ఎలా తెలుస్తుంది? అనే సందేహం చాలా మందికి ఉంటుంది

TV9 Telugu

కొన్ని శారీరక మార్పుల వల్ల ఆ విషయాన్ని సులభంగా గ్రహించచ్చని నిపుణులు అంటున్నారు. మధుమేహం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు లేనప్పటికీ కొందరు తరచూ మూత్ర విసర్జనకు వెళ్తుంటారు

TV9 Telugu

ఇలాంటి వారు ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటున్నారేమో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో యూరిన్‌కి వెళుతుంటే మాత్రం ఆహారంలో ఉప్పు వాడకంపై నియంత్రణ పాటించాల్సిందే

TV9 Telugu

శరీర భాగాల్లో వాపు రావడమనేది సాధారణంగా హైబీపీ బాధితుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఉప్పు అధికంగా తీసుకునే వారి శరీరంలో అక్కడక్కడా వాపు రావడం గమనించచ్చు

TV9 Telugu

ముఖ్యంగా పాదాల్లో నీటి నిల్వ పెరిగిపోయి ఉబ్బుతాయి. ఆహారంలో ఉప్పు తగ్గిస్తే ఇలాంటి సమస్యల నుంచి క్రమంగా బయటపడచ్చంటున్నారు నిపుణులు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే నాలుకపై ఉండే రుచి మొగ్గలపై ప్రభావం చూపి నోటికి రుచి తెలియకుండా అవుతుంది

TV9 Telugu

మోతాదుకు మించి ఉప్పును తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయులు పెరిగిపోతాయి. ఇది క్యా‌ల్షియం స్థాయుల పైనా ప్రతికూల ప్రభావం చూపుతుందట. దీంతో ఎముకలు బలహీనమవుతాయి

TV9 Telugu

తీసుకునే ఆహారంలో భాగంగా ఉప్పును తగ్గించుకోవాలంటే మార్కెట్లో దొరికే ప్యాక్‌ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే కొన్ని రకాల మసాలాలు, సీజనింగ్స్‌ని ఎంచుకునే క్రమంలో సోడియం లేనివి సెలక్ట్‌ చేసుకోవడం మంచిది