School Bus: 37 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
మోటహల్దులోని జాతీయ రహదారిపై 37 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి స్థానికుల సాయంతో 37 మంది పిల్లలను సురక్షితంగా కాపాడారు. షాంఫోర్డ్ సీనియర్ సెండరీ స్కూల్‌కి చెందిన బస్సుగా గుర్తించారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే, సమీపంలోని హైవే నిర్మాణంలో పనిచేస్తున్న NH ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఉద్యోగులు మంటలను అదుపు చేసేందుకు..

హల్దు చౌడ్, డిసెంబర్ 10: మోటహల్దులోని జాతీయ రహదారిపై 37 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి స్థానికుల సాయంతో 37 మంది పిల్లలను సురక్షితంగా కాపాడారు. షాంఫోర్డ్ సీనియర్ సెండరీ స్కూల్‌కి చెందిన బస్సుగా గుర్తించారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే, సమీపంలోని హైవే నిర్మాణంలో పనిచేస్తున్న NH ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఉద్యోగులు మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. కాసేపట్లోనే మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలను ఆర్పే ప్రయత్నంలో డ్రైవర్ చేతులు కాలాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణహాని కలగలేదు. బస్సులో మంటలు చెలరేగడానికి షార్ట్‌సర్క్యూటే కారణమని డ్రైవర్ చెబుతున్నారడు. ఇంతలో పాఠశాల యాజమాన్యం మరో బస్సును పంపించి పిల్లలను క్షేమంగా పాఠశాలకు తరలించారు.
ఉత్తరాఖండ్ లోని షాంఫోర్డ్ సీనియర్ సెకండరీ స్కూల్ బస్సు డ్రైవర్ ఖేమ్ సింగ్ ఎప్పటిలాగే హల్దు చౌడ్ గ్రామీణ ప్రాంతాల నుంచి 37 మంది పిల్లలను శనివారం ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తున్నాడు. ఉదయం 8 గంటల ప్రాంతంలో మోటహల్దు జాతీయ రహదారిపై జియో (రిలయన్స్) పెట్రోల్ పంపు ముందుకు చేరుకోగానే బస్సు లోపల ఇంజిన్ నుంచి కాలిన వాసన రావడంతో.. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును హైవే పక్కన నిలిపాడు. కొద్దిసేపటికే బస్సు ఇంజన్ నుంచి భారీగా పొగలు వచ్చాయి. దీంతో భయభ్రాంతులకు గురైన చిన్నారు భయంతో కేకలు వేశారు. చిన్నారుల అరుపులు విని స్థానికులు, బాటసారులు బస్సు వైపు పరుగులు తీశారు. అప్పటికే డ్రైవర్ బస్సు ఎమర్జెన్సీ డోర్‌ను పగులగొట్టి పిల్లలను బయటకు తీయడం ప్రారంభించాడు. అక్కడికి చేరుకున్న స్థానికులు తలోచెయ్యివేసి పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం బస్సులోని మంటలను ఆర్పేందుకు డ్రైవర్ ప్రయత్నించగా అతడి చేతులు కాలాయి.
సమీపంలోని NH నిర్మాణంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ ఉద్యోగులు, క్యాంపు సమీపంలోని నీటి ట్యాంకర్లను పైపులతో కనెక్ట్ చేసి, బస్సుపై నీళ్లు చల్లడం ప్రారంభించారు. మంటలను అదుపు చేసేందుకు సుమారు గంటపాటు శ్రమించారు. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక బృందానికి సమాచారం అందించారు. హల్దు చౌద్ పోలీస్ పోస్ట్ ఇన్‌ఛార్జ్ సోమేంద్ర సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సమాచారం అందుకున్న గంట తర్వాత అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. అప్పటికే బస్సులో మంటలు అదుపులోకి వచ్చాయి. హైవేపై ఈ సంఘటన జరగడంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. హైవేకి ఇరువైపులా రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. అయితే పోలీసులు రావడంతో ట్రాఫిక్‌ను ఖాళీ చేయించారు. మంటలను అదుపు చేయడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. బస్సులో ఉన్న పిల్లలందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. ఇంజిన్ మంటలకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్ వర్మ, ఇన్‌స్పెక్టర్-ఇన్‌చార్జ్ కొత్వాలి లాల్కువాన్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








