Shivam Dube: వామ్మో.. రూ.27.5 కోట్లతో ఫ్లాట్లు కొన్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ హీరో.. లగ్జరీ లైఫ్ చూశారా?
Shivam Dube Mumbai Flats: టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించిన శివమ్ దూబే ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచాడు. సెమీఫైనల్, ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఈ ఆల్‌రౌండర్ ముంబైలో కోట్ల విలువైన రెండు లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేయడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Shivam Dube Property Price: టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత పలువురు ఆటగాళ్లు వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సంజూ శాంసన్ (Sanju Samson), ఇషాన్ కిషన్ (Ishan Kishan) ప్రదర్శనలు ఎక్కువ చర్చకు దారి తీశాయి. అయితే, మరో ఆటగాడు తన ఆటతో పాటు వ్యక్తిగత జీవితం కారణంగా కూడా వార్తల్లో నిలిచాడు. అతనే శివం దుబే (Shivam Dube). సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో చిన్నదే అయినా, వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడి టీమ్ ఇండియా విజయానికి కీలకంగా మారాడు. అతని ఆట మాత్రమే కాకుండా ఫైనల్ తర్వాత ట్రైన్‌లో ప్రయాణం చేసిన సంఘటన కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
ముంబైలో రూ.27.5 కోట్ల ఫ్లాట్స్..
ఇప్పుడు శివమ్ దూబే మరో కారణంతో చర్చల్లోకి వచ్చాడు. అతను ముంబైలో ఖరీదైన రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాడు. నివేదికల ప్రకారం 2025 జూన్‌లో ముంబైలోని ప్రసిద్ధ ఓషివారా ప్రాంతంలో ఉన్న ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లో రెండు ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. ఈ ఫ్లాట్ల మొత్తం విలువ సుమారు రూ.27.50 కోట్లు.
ఈ రెండు ఫ్లాట్లు DLH ఎన్‌క్లేవ్ ప్రాజెక్ట్‌లో ఉన్నాయి. వాటిని Dev Land & Housing Limited సంస్థ నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఒక ఫ్లాట్ 17వ అంతస్తులో ఉండగా, మరో ఫ్లాట్ 18వ అంతస్తులో ఉంది. ఈ రెండు ఫ్లాట్ల మొత్తం విస్తీర్ణం సుమారు 9600 స్క్వేర్ ఫీట్లు.
స్టాంప్ డ్యూటీకి రూ.1.65 కోట్లు..
View this post on Instagram
ఈ లగ్జరీ ఫ్లాట్ల కొనుగోలుకు శివమ్ దూబే భారీ మొత్తాన్ని ఖర్చు చేశాడు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం కేవలం స్టాంప్ డ్యూటీ రూపంలోనే రూ.1.65 కోట్లు చెల్లించాడు. ఇది మాత్రమే కాదు, అదే సొసైటీలో మూడు పార్కింగ్ స్లాట్లను కూడా కొనుగోలు చేశాడు. ఈ వివరాలు బయటకు రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
క్రికెట్ ద్వారా భారీ ఆదాయం..
శివమ్ దూబే ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. భారత క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ (Board of Control for Cricket in India) నుంచి ప్రతి టీ20 మ్యాచ్‌కు సుమారు రూ.3 లక్షలు మ్యాచ్ ఫీజుగా పొందుతున్నాడు. అదే సమయంలో అతను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో సీ గ్రేడ్‌లో ఉండి సంవత్సరానికి రూ.1 కోటి సంపాదిస్తున్నాడు.
ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League)లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2025 మెగా ఆక్షన్‌కు ముందు చెన్నై (CSK) అతన్ని రూ.12 కోట్లకు రిటైన్ చేసింది.
వరల్డ్ కప్‌లో కీలక ఇన్నింగ్స్..
View this post on Instagram
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో శివమ్ దూబే కేవలం 25 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోర్ అందించాడు. అదే విధంగా ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 8 బంతుల్లో 26 పరుగులు చేసి భారత జట్టును విజయం వైపు నడిపించాడు.
ఈ ప్రదర్శనతో భారత్ వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన దూబే గత మూడు సంవత్సరాలుగా టీమ్ ఇండియాలో టీ20 ఫార్మాట్‌లో తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




