IT Raids: కాంగ్రెస్‌ నాయకుడి నివాసాలపై ఐటీ వరుస దాడులు.. రూ.100 కోట్లకుపైగా నగదు సీజ్‌

ఒడిశా కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన పలు ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) శుక్రవారం (డిసెంబర్‌ 8) వరుస దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.100 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. ఒడిశా, జార్ఖండ్ లో సాహుకు చెందిన నివాసాలపై బుధవారం నుంచి ఐటీ దాడులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఒడిశాలోని బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ప్రాంగణాల్లో దాడులు కొనసాగుతాయి. ఆదాయపు పన్ను శాఖ వర్గాల సమాచారం ప్రకారం..

IT Raids: కాంగ్రెస్‌ నాయకుడి నివాసాలపై ఐటీ వరుస దాడులు.. రూ.100 కోట్లకుపైగా నగదు సీజ్‌
IT Raids on Congress MP Dheeraj Sahu
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 08, 2023 | 5:26 PM

భువనేశ్వర్‌, డిసెంబర్ 8: ఒడిశా కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన పలు ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) శుక్రవారం (డిసెంబర్‌ 8) వరుస దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.100 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. ఒడిశా, జార్ఖండ్ లో సాహుకు చెందిన నివాసాలపై బుధవారం నుంచి ఐటీ దాడులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఒడిశాలోని బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ప్రాంగణాల్లో దాడులు కొనసాగుతాయి. ఆదాయపు పన్ను శాఖ వర్గాల సమాచారం ప్రకారం..

ధీరజ్ సాహు కుటుంబ సభ్యులు మద్యం తయారీ వ్యాపారం చేస్తున్నారు. ఒడిశాలో ఆయనకు అనేక మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒడిశాలోని బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌కి సంబంధించిన పలు ప్రదేశాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మద్యం తయారీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. బుధవారం నుంచి ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. సంబల్ పూర్, బోలంగీర్, తితిలాగఢ్, బౌధ్, సుందర్‌ఘర్, రూర్కెలా, భువనేశ్వర్‌లలో దాడులు జరుగుతున్నాయి. పట్టుబడిన నగదును లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్స్, 30 మందికి పైగా అధికారులను వినియోగిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంలో ఇతర కాంగ్రెస్ ఎంపీలు ప్రమేయం ఉంటుందని రాజ్యసభ సభ్యుడు (MP), జార్ఖండ్ బీజేపీ మాజీ చీఫ్ దీపక్ ప్రకాష్ ఎక్స్‌ వేదికగా పోస్ట్ షేర్‌ చేశారు. దాడులకు సంబంధించిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ.. ఇవి ఒకే ఒక కాంగ్రెస్ ఎంపీ ఇంటి నుంచి దాడిలో స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించిన ఫొటోలు. 70 యేళ్లలో ఇలా దేశాన్ని దోచుకున్న వారు ఇంకెంత మంది ఊహించండి అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమంత్రి హేమంత్ శర్మ ప్రభుత్వంలో జరుగుతున్న వేల కోట్ల కుంభకోణానికి ఇది కేవలం ఒక ఫిగర్ కాదు. అవినీతికి ఒక చిన్న ఉదాహరణగా తాజా సంఘటన నిరూపిస్తోందంటూ పేర్కొన్నారు. బీజేపీకి చెందిన అమర్ కుమార్ బౌరీ కూడా ఎక్స్‌లో అదే చిత్రాన్ని పంచుకుంటూ.. ‘అందిన సమాచారం ప్రకారం, డబ్బును లెక్కించడానికి తీసుకొచ్చిన యంత్రం కూడా పని చేయడం ఆగిపోయింది’ అంటూ ఎద్దేవా చేశారు. భువనేశ్వర్ లో జరుగుతున్న దాడులు ఐటీ డైరెక్టర్ సంజయ్ బహదూర్ పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.