Viral: పందెం కాశాడు., ఓడిపోయాడు.. అరగుండు, అర మీసంతో కనిపించాడు.?

Viral: పందెం కాశాడు., ఓడిపోయాడు.. అరగుండు, అర మీసంతో కనిపించాడు.?

Anil kumar poka

|

Updated on: Dec 08, 2023 | 7:14 PM

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అభ్యర్థి ఓడిపోతే మీసం సగం తీయడంతో పాటు అర గుండు చేయించుకుంటానని ఒక వ్యక్తి స్నేహితులతో పందెం కాశాడు. ఆ బీజేపీ అభ్యర్థి ఓడిపోవడంతో పందెం ప్రకారం అన్నంత పనీ చేశాడు. మీసం సగం వరకు షేవ్‌ చేయడంతోపాటు అర గుండు చేయించుకున్నాడు. మహాసముంద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అసలేమైందంటే.. చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే ఆదివారం కౌంటింగ్‌ సందర్భంగా ఎలక్ట్రీషియన్ దేర్హా రామ్ యాదవ్ తన స్నేహితులతో పందెం కాశాడు.

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అభ్యర్థి ఓడిపోతే మీసం సగం తీయడంతో పాటు అర గుండు చేయించుకుంటానని ఒక వ్యక్తి స్నేహితులతో పందెం కాశాడు. ఆ బీజేపీ అభ్యర్థి ఓడిపోవడంతో పందెం ప్రకారం అన్నంత పనీ చేశాడు. మీసం సగం వరకు షేవ్‌ చేయడంతోపాటు అర గుండు చేయించుకున్నాడు. మహాసముంద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అసలేమైందంటే.. చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే ఆదివారం కౌంటింగ్‌ సందర్భంగా ఎలక్ట్రీషియన్ దేర్హా రామ్ యాదవ్ తన స్నేహితులతో పందెం కాశాడు. కల్లారి అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అల్కా చంద్రకర్ ఓడిపోతే అరగుండు చేయించుకుంటానని, మీసం పాక్షికంగా తీసేస్తానని చెప్పాడు. కాగా, ఆదివారం నాటి ఎన్నికల ఫలితాల్లో కల్లారి స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ద్వారికాధీష్ యాదవ్ చేతిలో బీజేపీ అభ్యర్థి చంద్రకర్ ఓడిపోయాడు. దీంతో దేర్హా రామ్ యాదవ్ వెంటనే బార్బర్ షాప్‌కు వెళ్లాడు. పందెం మేరకు సగం గుండు కొట్టించుకోవడంతోపాటు సగం వరకు మీసం తీసేశాడు. అతడు అరగుండు, అర మీసంతో ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.