Murder Case: ప్రముఖ సీరియల్‌ నటుడు అరెస్ట్.. పొరుగింటి వ్యక్తిని గన్‌తో కాల్చి దారుణ హత్య

టీవీ నటుడు భూపీందర్ సింగ్‌ (54)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వ్యక్తిన హత్య చేసిన నేరం కింద అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిజ్నూర్‌లో జరిగిన గొడవల్లో ఓ వ్యక్తికి బుల్లెట్‌ తగిలి మరణించగా, మరో ముగ్గురుని తీవ్రంగా గాయరిచాడు. చెట్ల నరికి వేత విషయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. భూపిందర్ సింగ్, అతని సర్వెంట్లు ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై లైసెన్స్ లేని అక్రమ ఆయుధాలతో 10 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గోవింద్ (23) అనే వ్యక్తిని హత్య చేశారు. మృతుడి తండ్రి గుర్దీప్ సింగ్, తల్లి మీరా బాయి, అన్నయ్య అమ్రీక్ సింగ్‌పై కాల్పులు..

Murder Case: ప్రముఖ సీరియల్‌ నటుడు అరెస్ట్.. పొరుగింటి వ్యక్తిని గన్‌తో కాల్చి దారుణ హత్య
TV actor Bhupinder Singh
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 07, 2023 | 2:37 PM

టీవీ నటుడు భూపీందర్ సింగ్‌ (54)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వ్యక్తిన హత్య చేసిన నేరం కింద అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిజ్నూర్‌లో జరిగిన గొడవల్లో ఓ వ్యక్తికి బుల్లెట్‌ తగిలి మరణించగా, మరో ముగ్గురుని తీవ్రంగా గాయరిచాడు. చెట్ల నరికి వేత విషయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. భూపిందర్ సింగ్, అతని సర్వెంట్లు ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై లైసెన్స్ లేని అక్రమ ఆయుధాలతో 10 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గోవింద్ (23) అనే వ్యక్తిని హత్య చేశారు. మృతుడి తండ్రి గుర్దీప్ సింగ్, తల్లి మీరా బాయి, అన్నయ్య అమ్రీక్ సింగ్‌పై కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం బాధితులు ముగ్గురు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులపై సమాచారం అందుకున్న డీఐజీ మొరాదాబాద్‌ క్షతగాత్రుల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. పోలీసుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబం డీఐజీకి ఫిర్యాదు చేసింది. నవంబర్ 19న ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. కాల్పులు జరిపిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బిజ్నోర్‌లోని బధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కువాన్ ఖేడా గ్రామంలో నివసిస్తున్న గురుదీప్ సింగ్, తన పొలంలో యూకలిప్టస్ చెట్లను నరికివేయడం గురించి అతని పొరుగింటల్లో నివాసం ఉంటోన్న టీవీ నటుడు భూపీందర్ సింగ్‌తో గొడవ పడ్డాడు. భూపేంద్ర గతంలో కూడా నాలుగైదు యూకలిప్టస్ చెట్లను నరికివేసినట్లు తెలిపారు. దీనిపై నవంబర్ 19న బాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో గురుదీప్ సింగ్ ఫిర్యాదు చేశాడు. అయితే ఆయన ఫిర్యాదును పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదు. ఇటీవల మళ్లీ చెట్ల నరికివేత విషయంలో గురుదీప్ సింగ్ కుటుంబానికి, భూపేంద్ర సింగ్‌కు మధ్య మరోమారు వివాదం నెలకొంది. భూపేంద్ర సింగ్, మరో వ్యక్తితో కలిసి తన లైసెన్స్ రివాల్వర్, మరో అక్రమ తుపాకీతో సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఇందులో గురుదీప్ సింగ్ కొడుకులలో ఒకరైన గోవింద్ అక్కడికక్కడే మరణించాడు. గురుదీప్‌ సింగ్‌ మరో కుమారుడు అమ్రిక్ సింగ్, అతని భార్య, గురుదీప్ సింగ్‌లకు బుల్లెట్లు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం గ్రామంలో తొక్కిసలాట జరిగి ఉద్రిక్తత నెలకొంది.

సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ మొరాదాబాద్‌ మునిరాజ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రధాన నిందితుడు భూపేంద్ర, అతని సర్వెంట్లను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని డీఐజీ తెలిపారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.కాగా ‘యే ప్యార్ నా హోగా కమ్’, ‘ఏక్ హసీనా థీ’, ‘మధుబాల – ఏక్ ఇష్క్ ఏక్ జునూన్’, ‘రిష్తోన్ కా చక్రవ్యూహ్’, ‘తేరే షెహెర్ మే’ వంటి ప్రముఖ హిందీ టీవీ సీరియల్స్‌లో భూపీందర్‌ నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.