AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wife Suicide: హఠాత్తుగా భార్య సూసైడ్‌.. మూడేళ్ల తర్వాత ఆమె ఫోన్‌ చెక్ చేసిన భర్త! ఒక్కసారిగా షాక్‌

మోలీ బ్రాడక్ (39) అనే మహిళ తనను తాను తుపాకితో కాల్చుకుని 2020, మార్చి 8న ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె మరణించి మూడుళ్ల తర్వాత ఇన్నాళ్ల అసలు కారణం బయటపడింది. దీంతో ఈ కేసుకు పుల్‌స్టాప్‌ పడినట్లైంది. మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. అట్లాంటా USAలో మోలీ నివసించేంది. రచయిత, యూనివర్సిటీ లెక్చరర్‌ అయిన ఆమె ఎప్పుడూ హ్యాపీగా ఉండేది. మోలీ హఠాత్తుగా సూసైడ్‌ చేసుకోవడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. మోలీ మరణంతో ఆమె భర్త బ్లేక్ బట్లర్ కూడా కుప్పకూలిపోయాడు. ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో..

Wife Suicide: హఠాత్తుగా భార్య సూసైడ్‌.. మూడేళ్ల తర్వాత ఆమె ఫోన్‌ చెక్ చేసిన భర్త! ఒక్కసారిగా షాక్‌
Wife Cheated Husband Lived Secret Life
Srilakshmi C
|

Updated on: Dec 06, 2023 | 5:02 PM

Share

అమెరికా, డిసెంబర్‌ 6: మోలీ బ్రాడక్ (39) అనే మహిళ తనను తాను తుపాకితో కాల్చుకుని 2020, మార్చి 8న ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె మరణించి మూడుళ్ల తర్వాత ఇన్నాళ్ల అసలు కారణం బయటపడింది. దీంతో ఈ కేసుకు పుల్‌స్టాప్‌ పడినట్లైంది. మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. అట్లాంటా USAలో మోలీ నివసించేంది. రచయిత, యూనివర్సిటీ లెక్చరర్‌ అయిన ఆమె ఎప్పుడూ హ్యాపీగా ఉండేది. మోలీ హఠాత్తుగా సూసైడ్‌ చేసుకోవడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. మోలీ మరణంతో ఆమె భర్త బ్లేక్ బట్లర్ కూడా కుప్పకూలిపోయాడు. ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో మొదట్లో కుటుంబ సభ్యులెవ్వరికీ అర్థం కాలేదు. అయితే మోలీ మరణం తర్వాత, ఆమె భర్త బ్లేక్ బట్లర్ ఆమె ఫోన్‌ని తనిఖీ చేయగా ఆమె మరణం వెనుక అసలు కారణం వెల్లడైంది.

బ్లేక్ మోలీ గురించి చెబుతూ.. డిప్రెషన్‌తో బాధపడుతున్న మోలీ ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోగలదని నాకు తెలియదు. మోలీ మరణం తర్వాత, ఆమెపై ఒక పుస్తకం రాయడం ప్రారంభించాను. అయినప్పటికీ, ఆమె గురించి చాలా విషయాలు ఇప్పటికీ తనకు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మోలీ చాలా మంచి రచయిత. మోలీ, నేను ఫేస్‌బుక్‌లో కలుసుకున్నాం. మోలీ బాల్యం చాలా సవాళ్లతో గడిచింది. 12 ఏళ్ల నుంచి డ్రగ్స్‌కు బానిసైంది. మా పరిచయం మొదలైన నాటికే ఆమెకు వివాహం జరిగింది. కానీ ఆమె తన భర్తతో సంతోషంగా లేదు. ఆ తర్వాత మొదటి భర్తకు విడాకులిచ్చింది, 2017లో ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. మా జీవితం ఎంతో ఆనందంగా ప్రారంభమైంది. కానీ మోలీ ఆకస్మిక మరణం నన్ను కలవర పెట్టింది. ఆమె మరణించిన తర్వాత నేను ఆమె ఫోన్‌ని తనిఖీ చేసినప్పుడు, నా పాదాల క్రింద భూమి దాదాపు కంపించిందని తెలిపాడు.

బ్లేక్ బట్లర్ తన భార్య మోలీ ఫోన్‌ తనిఖీ చేయగా ఆమె రహస్య జీవితం గురించిన విషయాలు అప్పుడే తెలిశాయి. తమకు పెళ్లయిన కొద్ది వారాల్లోనే ఆమె తన విద్యార్థితో సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా ఆమెకు చాలా మంది పురుషులతో సంబంధాలున్నాయి. ఫోన్‌లో అసభ్యకరమైన బొమ్మలతో అభ్యంతరకరమైన ఫోటోలు ఉన్నాయి. బ్లేక్ ఆమె ఇమెయిల్‌ను చెక్ చేయగా.. మోలీ కాలేజీలోని పలువురు విద్యార్థులకు అసభ్యకరమైన ఫోటోలను పంపించినట్లు తెలిసింది. మోలీ చీకటి జీవితం బయటకు వచ్చిన తర్వాత, బ్లేక్‌ షాక్‌కు గురయ్యాడు. మానసిక వ్యాధితో పోరాడుతున్న మోలీ భావోద్వేగాలను అదుపు చేసుకోలేక డిప్రెషన్‌లో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాకు వెల్లడించాడు. కాగా మోలీ మరణించిన దాదాపు మూడేళ్ల తర్వాత ఆమె మరణానికి గత కారణం బయటపడటంతో మోలీ మరణానికి బ్లేక్‌ కారణం కాదని వెల్లడైంది. దీంతో అతను మళ్లీ వివాహం చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.