Shamiyana: పెళ్లికి షామియానా వేయలేదని కోర్టుకెక్కిన ఘనుడు.. కట్‌చేస్తే భారీగా జరిమానా

పెళ్లికి షామియా పెడతానని చెప్పి మాటతప్పినందుకు కన్‌జ్యూమర్‌ కోర్టు భారీ జరిమానా విధించింది. ఈ మేరకు ధార్వాడ్ జిల్లా కంజ్యూమర్‌ వివాదాల పరిష్కార కమిషన్ కర్నాటకలోని హుబ్బళ్లి ఉనకల్ సాయినగర్‌కు చెందిన ఓంకార షామియా యజమానికి జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అసలేం జరిగిందంటే.. కర్ణాటకలోని ధార్వాడ్‌ జిల్లా బసవేశ్వర్‌ బ్యారేజీకి చెందిన రిటైర్డ్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఉద్యోగి దైమప్ప సనక్కి అనే వ్యక్తికి ఇద్దరు సంతానం. 2021 ఏప్రిల్‌ 25న తన కుమారుడి పెళ్లికి షామియా వేయాలని కోరుతూ హుబ్బళ్లిలోని..

Shamiyana: పెళ్లికి షామియానా వేయలేదని కోర్టుకెక్కిన ఘనుడు.. కట్‌చేస్తే భారీగా జరిమానా
Consumer Court
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 05, 2023 | 4:11 PM

బెంగళూరు, డిసెంబర్‌ 5: పెళ్లికి షామియా పెడతానని చెప్పి మాటతప్పినందుకు కన్‌జ్యూమర్‌ కోర్టు భారీ జరిమానా విధించింది. ఈ మేరకు ధార్వాడ్ జిల్లా కంజ్యూమర్‌ వివాదాల పరిష్కార కమిషన్ కర్నాటకలోని హుబ్బళ్లి ఉనకల్ సాయినగర్‌కు చెందిన ఓంకార షామియా యజమానికి జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అసలేం జరిగిందంటే.. కర్ణాటకలోని ధార్వాడ్‌ జిల్లా బసవేశ్వర్‌ బ్యారేజీకి చెందిన రిటైర్డ్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఉద్యోగి దైమప్ప సనక్కి అనే వ్యక్తికి ఇద్దరు సంతానం. 2021 ఏప్రిల్‌ 25న తన కుమారుడి పెళ్లికి షామియా వేయాలని కోరుతూ హుబ్బళ్లిలోని ఉనకల్‌ సాయినగర్‌కు చెందిన ఓంకార షామియానా యజమాని నింగప్పతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్ కింద రూ. 50 వేలు కూడా చెల్లించాడు.

ఇంతలో కోవిడ్ వల్ల లాక్‌డౌన్‌ రావడంతో అంబరాయ్ గార్డెన్‌లో జరగాల్సిన పెళ్లిని తన ఇంటికి మార్చాడు. దీంతో ఈ విషయాన్ని ఓంకార షామియానా యజమాని నింగప్పకు తెలియజేశాడు. కానీ పెళ్లి జరిగిన రోజున ఇంటి వద్ద షామియానా వేయలేదు. ఎందుకు వేయలేదని షామియానా యజమాని నింగప్పను అడుగగా కోవిడ్ కారణం వేయలేకపోయానని సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత గతేడాది సెప్టెంబర్ 28వ తేదీన తమ కుమార్తె వివాహానికి షామియానా వేయాలని నింగప్పను కోరాడు. కానీ ఈ పెళ్లికి కూడా నింగప్ప షామియానా వేయలేదు. దీంతో దైమప్ప కంజ్యూమర్‌ కోర్టును ఆశ్రయించాడు.

ఇవి కూడా చదవండి

కేసును విచారించిన కమిషన్ చైర్మన్ ఈశప్ప భూతే, సభ్యులు విశాలాక్షి బోళశెట్టి, ప్రభు హీరేమఠ్‌.. రూ.50వేలు ఫీజు కింద పొందిన తర్వాత కూడా దైమప్ప కుమారుడి పెళ్లికి గానీ, కూతురు పెళ్లికి గానీ షామియానా వేయకపోవడాన్ని తప్పుబట్టింది. వినియోగదారుల రక్షణ చట్టం కింద దీనిని సేవా లోపంగా పరిగణించింది. ఫిర్యాదుదారు చెల్లించిన రూ.50 వేలతోపాటు, ఫీజు చెల్లించి నాటి (2021) నుంచి వడ్డీ కలిపి నెల రోజుల్లోగా డబ్బు తిరిగిచెల్లించాలని ఓంకార షామియా యజమాని నింగప్పను కంజ్యూమర్‌ కోర్టు ఆదేశించింది. ఫిర్యాదుదారుడికి కలిగించిన బాధ, మానసిక హింసకు పరిహారంగా రూ. 15 వేలు, కేసు ఖర్చుల కింద రూ. 5 వేలు చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.

No.1 న్యూస్‌ నెట్‌వర్క్‌.. No.1 ఎలక్షన్‌ కవరేజ్‌.. డిజిటల్ రంగంలో రికార్డులు బద్దలు కొట్టిన టీవీ9 తెలుగు..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.