AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Michaung: మిచౌంగ్ బీభత్సం.. తమిళనాడు అతలాకుతలం.. ఆ జిల్లాల్లో కుండపోత వానలు..

మిచౌంగ్ తుపాను తమిళనాడులో బీభత్సం సృష్టించింది. భారీ వర్షం కారణంగా చెన్నై నగరం అతలాకుతలమైంది. అనేక ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నైలో భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకూ ఎనిమిది మంది మరణించారు. విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, నగరంలోని అప్‌మార్కెట్, బీసెంట్ నగర్ ప్రాంతంలో చెట్లు కూలడంతో ఒకరు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

Cyclone Michaung: మిచౌంగ్ బీభత్సం.. తమిళనాడు అతలాకుతలం.. ఆ జిల్లాల్లో కుండపోత వానలు..
Cyclone Michoung Has A Severe Impact In Many Districts Of Tamil Nadu, Cm Stalin Has Ordered The Officials To Take Relief Measures.
Srikar T
|

Updated on: Dec 05, 2023 | 4:42 PM

Share

మిచౌంగ్ తుపాను తమిళనాడులో బీభత్సం సృష్టించింది. భారీ వర్షం కారణంగా చెన్నై నగరం అతలాకుతలమైంది. అనేక ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నైలో భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకూ ఎనిమిది మంది మరణించారు. విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, నగరంలోని అప్‌మార్కెట్, బీసెంట్ నగర్ ప్రాంతంలో చెట్లు కూలడంతో ఒకరు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. చెన్నై జిల్లాలోని పెరుంగుడిలో 45 సెంటీమీటర్ల వర్షం పడగా.. తిరువళ్లూరు జిల్లా పూనమల్లి 34 సెంటీమీటర్లు, ఆవడిలో 28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చెన్నైలో పలు ప్రాంతాల్లో భారీ వరద కారణంగా కార్లు కొట్టుకుపోయాయి.

చెన్నైలోని అనేక ప్రాంతాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. నిన్న ఉదయం నుండి నగరంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుపాన్ కారణంగా నిన్న చెన్నై ఎయిర్‌పోర్టును మూసివేశారు. అయితే ఈ రోజు వర్షాలు కాస్త తగ్గడంతో మళ్లీ సర్వీసులను మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు. తమిళనాడు సీఎం స్టాలిన్.. రాష్ట్రంలోని తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. చెన్నైలోని కన్నపర్ తితల్‌లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాన్ని సందర్శించారు. భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టం, తుపాను అనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

తమిళనాడులోని పది జిల్లాల్లో ఈ రోజు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. చెన్నై, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, కాంచీపురం, రాణిపేట, వేలూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..