Elections: చిప్ ఉన్న ఏ యంత్రాన్నైనా హ్యాక్ చేయొచ్చు.. ఈవీఎమ్‌లపై దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు.
చిప్ ఉన్న ఏయంత్రాన్ని అయినా హ్యాక్ చేసే అవకాశం ఉంది ఉంటూ సంచలన ఆరోపణ చేశారు. 2003 నుంచి తాను ఈవీఎంల ద్వారా ఓటింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన దగ్విజయ్.. భారతీయ ప్రజాస్వామ్యాన్ని ప్రొఫెషనల్ హ్యాకర్లు నియంత్రించడాన్ని అనుతిద్దామా.? అంటూ ప్రశ్నించారు. ఇది అన్ని రాజకీయ పార్టీలు పరిష్కరించాల్సిన ప్రాథమిక ప్రశ్న అన్న దిగ్విజయ్ సింగ్..

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎమ్‌ఐ పనితీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంపై స్పందించిన ఆయన.. ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానం వ్యక్తం చేశారు.
చిప్ ఉన్న ఏయంత్రాన్ని అయినా హ్యాక్ చేసే అవకాశం ఉంది ఉంటూ సంచలన ఆరోపణ చేశారు. 2003 నుంచి తాను ఈవీఎంల ద్వారా ఓటింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన దగ్విజయ్.. భారతీయ ప్రజాస్వామ్యాన్ని ప్రొఫెషనల్ హ్యాకర్లు నియంత్రించడాన్ని అనుతిద్దామా.? అంటూ ప్రశ్నించారు. ఇది అన్ని రాజకీయ పార్టీలు పరిష్కరించాల్సిన ప్రాథమిక ప్రశ్న అన్న దిగ్విజయ్ సింగ్.. సుప్రీం కోర్ట్, భారత ఎన్నికల సంఘం భారత ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తారా.? అంటూ ట్వీట్ చేశారు.
దిగ్విజయ్ సింగ్ ట్వీట్..
Any Machine with a Chip can be hacked. I have opposed voting by EVM since 2003. Can we allow our Indian Democracy to be controlled by Professional Hackers! This is the Fundamental Question which all Political Parties have to address to. Hon ECI and Hon Supreme Court would you… https://t.co/8dnBNJjVTQ
— digvijaya singh (@digvijaya_28) December 5, 2023
ఇదిలా ఉంటే దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఛత్తీస్‌ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో దిక్కుతోచని స్ధితిలో ఆ పార్టీ ఈవీఎంలను నిందిస్తోందని బీజేపీ నాయకులు ఎద్దేవా చేశార. ఇక దిగ్విజయ్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఖండించారు. ఓటమి ఎదురైన తర్వాతే కాంగ్రెస్ ఈ ఆరోపణలు గుప్పిస్తోందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ తెలంగాణలో గతంలో హిమాచల్ ప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో విజయం సాధించినప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడలేదని అన్నారు. సనాతన ధర్మాన్ని మీరు విమర్శిస్తే కాంగ్రెస్ పరిస్ధితి ఇలాగే ఉంటుందని ఆ పార్టీ నేత ప్రమోద్ కృష్ణ సరిగ్గా చెప్పారని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఇండియా పేరిట ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ఫ్రంట్ విపక్ష కూటమి కాదని, అది అహంకార కూటమి అని అది కుప్పకూలడం ఖాయమని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




