AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDIA Alliance: మిత్రపక్షాల్లో అసహనం.. ఇండియా కూటమి సమావేశం రద్దు.. కారణం అదేనా..?

INDIA Alliance Meeting: ఇండియా కూటమి భేటీ డిసెంబర్ 6 (బుధవారం) ఉంటుందని ముందుగా ప్రకటించారు. ఈ క్రమంలో దాన్ని రద్దు చేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జరగాల్సిన ఇండియా కూటమి సమావేశం రద్దయినట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈనెల మూడోవారంలో సమావేశం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

INDIA Alliance: మిత్రపక్షాల్లో అసహనం.. ఇండియా కూటమి సమావేశం రద్దు.. కారణం అదేనా..?
INDIA Alliance
Srikar T
|

Updated on: Dec 05, 2023 | 10:16 PM

Share

INDIA Alliance Meeting: ఇండియా కూటమి భేటీ డిసెంబర్ 6 (బుధవారం) ఉంటుందని ముందుగా ప్రకటించారు. ఈ క్రమంలో దాన్ని రద్దు చేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జరగాల్సిన ఇండియా కూటమి సమావేశం రద్దయినట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈనెల మూడోవారంలో సమావేశం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి హాజరుకావడం లేదని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ , సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ ఇప్పటికే ప్రకటించారు. దీంతో కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. కాంగ్రెస్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందన్న భావన ఇండియా కూటమి నేతల్లో నెలకొంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేసిందని , మిత్రపక్షాలను పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ వేర్వేరుగా మధ్యప్రదేశ్‌లో పోటీ చేశాయి. విపక్షాల ఓట్లు చీలడంతోనే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. దీనికి కాంగ్రెస్‌ వైఖరే కారణమని మండిపడ్డారు.

అంతేకాకుండా.. కాంగ్రెస్‌ కలుపుకునిపోకపోవడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయన్న విమర్శలు సైతం కూటమిలోని నేతల నుంచి వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచినా, ఇండియా కూటమి ఓట్లు చీలడం వల్ల మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిందని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. సీట్ల సర్దుబాటు ఉండాలని తాము చెప్పామని కానీ కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే సైద్ధాంతిక బలంతోపాటు, వ్యూహం కూడా అవసమని అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో గెలవాలంటే, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటే, బీజేపీ అధికారంలోకి రాదన్నారు.

ఇవి కూడా చదవండి
Tv9 Telugu

Tv9 Telugu

బీజేపీ వంటి పార్టీని ఎదుర్కోవాలంటే, క్రమశిక్షణ కావాలని సమాజ్‌వాది చీఫ్‌ అఖిలేష్‌యాదవ్‌ కాంగ్రెస్‌కు చురకలు పెట్టారు. కలసికట్టుగా పనిచేస్తే, మున్ముందు ఫలితాలు భిన్నంగా ఉంటాయన్నారు. మధ్యప్రదేశ్‌లో తమను సీట్ల సర్దుబాటుకు పిలిచి, సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్‌ అవమానించిందని అఖిలేష్‌ విమర్శించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఇండియా కూటమిలోని పార్టీల నేతల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూటమి సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..